News January 29, 2025
రేషన్ కార్డులపై ప్రధాని ఫొటో ఉండాలి: బండి

TG: రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాలను అర్హులందరికీ ఇవ్వకపోవడం దారుణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 70 లక్షల మంది అర్హులైన రైతులు ఉంటే 65 లక్షల మంది ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేయకపోవడం బాధాకరమని సీఎం రేవంత్కు లేఖ రాశారు. కేంద్రమే ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తోందని, కార్డులపై మోదీ ఫొటో ఉండాలని డిమాండ్ చేశారు. ప్రధాని ఆవాస్ యోజన ఇళ్లకు అదే పేరు కొనసాగించాలన్నారు.
Similar News
News January 20, 2026
స్కిప్పింగ్తో ఎన్నో లాభాలు

ప్రతిరోజు స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందంటున్నారు నిపుణులు. స్కిప్పింగ్ చేయడం వల్ల కండరాలు పటిష్ఠడతాయి. గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగు పడుతుంది. కాళ్లు, చేతులు, ఇతర అవయవాల మధ్య సమన్వయం చక్కగా కుదురుతుంది. తద్వారా బాడీ బ్యాలెన్స్ పెరుగుతుంది. క్యాలరీలు ఎక్కువ ఖర్చై బాడీ ఫిట్గా మారుతుంది. అంతేకాకుండా స్కిప్పింగ్ చేయడం ద్వారా డోపమైన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది.
News January 20, 2026
72 గంటల్లో లొంగిపోండి.. ఇరాన్ హెచ్చరికలు

నిరసనకారులకు ఇరాన్ అల్టిమేటం జారీ చేసింది. 72 గంటల్లోగా లొంగిపోవాలని, లేదంటే కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నేషనల్ పోలీస్ చీఫ్ అహ్మద్ రెజా హెచ్చరించారు. అల్లర్లలో పాల్గొన్న యువకులను శత్రు సైనికులుగా కాకుండా మోసపోయిన వారిగా పరిగణిస్తామని చెప్పారు. గడువులోగా సరెండర్ అయితే వారిపై దయతో వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు. 2 వారాలుగా ఇరాన్లో జరుగుతున్న నిరసనల్లో వేలాది మంది చనిపోయిన విషయం తెలిసిందే.
News January 20, 2026
అడవులు ఖాళీ.. ఇక దోమల టార్గెట్ మనుషులే!

అడవులు తగ్గిపోతుండటంతో దోమలు ఇప్పుడు జంతువులకు బదులుగా మనుషుల రక్తం తాగడానికి ఇష్టపడుతున్నాయని బ్రెజిల్లో జరిగిన స్టడీలో తేలింది. అడవులు అంతరించిపోవడం వల్ల జంతువులు దూరమై దోమలకు వేరే ఆప్షన్ లేక మనుషులపై పడుతున్నాయట. 1,700 దోమలపై జరిపిన ఈ అధ్యయనంలో అవి మనుషుల రక్తానికే ప్రాధాన్యం ఇస్తున్నాయని తెలిసింది. దీనివల్ల ఫ్యూచర్లో కొత్త రకమైన రోగాలు వ్యాపించే ప్రమాదం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.


