News September 2, 2025
ఈనెల 5న రేషన్ డీలర్ల బంద్

TG: ఐదు నెలల కమీషన్ డబ్బులు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర డీలర్ల సంక్షేమ సంఘం ఈనెల 5న బంద్‌కు పిలుపునిచ్చింది. గత ఐదు నెలలుగా డీలర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది. మరోవైపు ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం గౌరవ వేతనం రూ.5 వేలు, కమీషన్ రూ.300 పెంచాలని డీలర్లు డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News September 21, 2025
చంద్రబాబు వల్లే పోలవరం ఆలస్యం: బుగ్గన

AP: పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి చంద్రబాబే కారణమని వైసీపీ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. కాఫర్ డ్యామ్ పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ ఎలా కట్టారని ప్రశ్నించారు. పోలవరానికి శంకుస్థాపన చేసి, అన్ని అనుమతులు తెచ్చింది వైఎస్సారేనని అన్నారు. హంద్రీ-నీవాపైనా చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని, అందులో ఎక్కువ పనులు చేసింది రాజశేఖర్ రెడ్డేనని చెప్పారు.
News September 21, 2025
స్టూడెంట్స్.. టెన్షన్ వద్దు!

H1B వీసా ఫీజులను లక్ష డాలర్లకు <<17779352>>పెంచడంతో<<>> అమెరికాలో మాస్టర్స్ చేస్తున్న భారత విద్యార్థులు ఉద్యోగాలు రావని ఆందోళన చెందుతున్నారు. అయితే అమెరికాకు F1 వీసాపై వెళ్లిన విద్యార్థులు చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం వస్తే 12 నెలల పాటు అక్కడ ఉండవచ్చు. మరో 24 నెలలు OPT ఎక్స్‌టెన్షన్ ఫెసిలిటీ ఉంటుంది. అంటే చదువు పూర్తయిన మూడేళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ లోగా ట్రంప్ ప్రభుత్వం మారి H1B రూల్స్ మారొచ్చు.
News September 21, 2025
H1B ఫీజు రూల్స్.. పూర్తి వివరాలు

*కొత్తగా H1B కోసం అప్లై చేసుకునే వారికే వర్తిస్తుంది. (అంటే 2026 నుంచి వీసా పిటిషన్ ఫైల్ చేసే వారికి)
*కొత్త వీసా కోసం కంపెనీలు లక్ష డాలర్లు ఒకేసారి చెల్లించాలి. ప్రతి ఏడాది కట్టాల్సిన అవసరం లేదు
*ప్రస్తుతం H1B వీసా ఉన్నవారికి ఇది వర్తించదు
*వీసా రెన్యూవల్స్, 2025 లాటరీ విన్నర్లకూ మినహాయింపు
*ప్రస్తుతం వీసా ఉన్నవారు ఇతర దేశాలకు వెళ్లవచ్చు. తిరిగి అమెరికాకు వచ్చేటప్పుడు ఎలాంటి అడ్డంకులు ఉండవు.