News October 28, 2025

ఈ 12 జిల్లాల్లో నేటి నుంచే రేషన్ పంపిణీ

image

AP: తుఫాను ప్రభావిత జిల్లాల్లో ఇవాళ్టి నుంచే రేషన్ పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, కోనసీమ, ప.గో, కృష్ణా, బాపట్ల, కాకినాడ, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లోని రేషన్ లబ్ధిదారులకు సరుకులు అందజేయనున్నారు. అటు ఈ 12 జిల్లాల్లో రాబోయే 3 రోజులపాటు పెట్రోల్, డీజిల్ కొరత రాకుండా కంపెనీలతో మాట్లాడి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.

Similar News

News October 28, 2025

ఈ మందు ‘యమ’ డేంజర్

image

TG: రాష్ట్రంలో ఆత్మహత్యలకు వినియోగిస్తున్న పారాక్వాట్ గడ్డిమందును బ్యాన్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కొన్నిగంటల్లోనే గడ్డిని మాడిపోయేలా చేసే ఈ మందును రైతులు వాడతారు. అయితే ఆత్మహత్యలకూ వినియోగించడం ఆందోళన కలిగిస్తోంది. ఇది తాగిన వెంటనే కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. విరుగుడు లేకపోవడంతో 98% కేసుల్లో మరణాలు సంభవిస్తున్నాయి. మన దేశం కేరళ, ఒడిశాతో పాటు 32దేశాల్లో నిషేధం ఉంది.

News October 28, 2025

మునగ సాగు.. ఏటా రూ.40 లక్షల ఆదాయం

image

మునగ సాగుతో అధిక ఆదాయం పొందుతున్నారు కర్ణాటకకు చెందిన ఉమేశ్‌రావు. 2010 నుంచి 10 ఎకరాల భూమిలో సహజ ఎరువులు వాడుతూ మునగసాగు చేస్తున్నారు. మార్కెట్‌లో మునగాకులపొడికి ఉన్న డిమాండ్ చూసి దాన్నే తయారు చేసి వివిధ కంపెనీలకు విక్రయిస్తున్నారు. ఏటా ఎకరాకు రూ.4 లక్షల చొప్పున 10 ఎకరాల నుంచి రూ.40 లక్షల ఆదాయం పొందుతున్నారు.✍️ ప్రతిరోజూ ఇలాంటి కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News October 28, 2025

మరికాసేపట్లో తీవ్ర తుఫానుగా ‘మొంథా’!

image

AP: ‘మొంథా’ తుఫాను దూసుకొస్తోంది. గడిచిన 6గంటల్లో 17kmph వేగంతో కదులుతున్నట్లు APSDMA తెలిపింది. ప్రస్తుతం మచిలీపట్నంకి 230KM, కాకినాడకు 310KM, విశాఖపట్నంకి 370KM దూరంలో కేంద్రీకృతమైందని చెప్పింది. మరికాసేపట్లో తీవ్ర తుఫానుగా బలపడనుందని వివరించింది. రాత్రికి మచిలీపట్నం-కాకినాడ మధ్య తీరం దాటే ఛాన్స్ ఉందని పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని హెచ్చరించింది.