News August 5, 2025

వారికి ఇంటి వద్దకే రేషన్: మంత్రి మనోహర్

image

AP: కొత్త ‘స్మార్ట్’ రేషన్ కార్డులను ప్రభుత్వం ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు పంపిణీ చేయనుంది. ATM తరహాలో ఉండే ఈ కార్డులపై ఒకవైపు ప్రభుత్వ అధికారిక చిహ్నం, మరోవైపు కుటుంబ పెద్ద ఫొటో ఉంటాయి. వచ్చే నెల నుంచి ఈ కార్డులపైనే రేషన్ పంపిణీ చేస్తారు. గిరిజన ప్రాంతాల్లో రేషన్ డిపోలకు దూరంగా ఉన్న వారికి ఇంటి వద్దే సరుకులు ఇస్తామని మంత్రి మనోహర్ తెలిపారు. ఇందుకోసం 69 మినీ రేషన్ డిపోలను ఏర్పాటు చేస్తామన్నారు.

Similar News

News August 5, 2025

నేడు తాడేపల్లిలో వైసీపీ సమావేశం

image

AP: తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఇవాళ ఆ పార్టీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో YCP చీఫ్ జగన్ ఆ పార్టీ నేతలతో పలు అంశాలపై మాట్లాడనున్నారు. తాజా రాజకీయ అంశాలు, పార్టీ నిర్మాణం, ప్రజా సమస్యలపై ఆయన వారితో చర్చిస్తారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నేతలు హాజరుకానున్నట్లు సమాచారం.

News August 5, 2025

BRSకు కష్టకాలం!

image

TG: ఇప్పటికే అంతర్గత సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న BRSను కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ మరింత ఇబ్బంది పెట్టేలా ఉంది. ఈ రిపోర్టుపై ఉభయసభల్లో చర్చిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. ఈ నివేదికపై జరిగే చర్చలో ఆయన పాల్గొని సమాధానం చెప్పకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

News August 5, 2025

‘ఒక్క ఛాన్స్’.. దొరికేనా?

image

‘ఒక్క ఛాన్స్’ అంటూ సినీ ఇండస్ట్రీలో ప్రొడక్షన్ కంపెనీల బయట ఎదురు చూసేవారు ఎందరో. అవకాశం వస్తే టాలెంట్ నిరూపించుకోవాలని చూస్తుంటారు. తాజాగా టాలీవుడ్ నిర్మాతలు <<17304563>>నిర్ణయం<<>>తో అలాంటి వారిలో ఆశలు పెరిగాయి. ఈ నిర్ణయంతో ఆసక్తి ఉన్న వారికి <>రిజిస్ట్రేషన్<<>> చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో కొత్తవారికి అవకాశాలు దొరకనున్నాయి. అయితే అర్హత ఉన్నవారికే చోటు ఇస్తారా? రికమండేషన్లకు ప్రాధాన్యం ఇస్తారా? అనే ప్రశ్నలూ లేవనెత్తుతున్నాయి.