News June 23, 2024
ఆగస్టు 11 వరకు రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి రైళ్లు రద్దు

AP: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నిడదవోలు-కడియం మధ్య ఆధునీకరణ పనుల కారణంగా ఈ నెల 23 నుంచి ఆగస్టు 11 వరకు పలు ప్రధానమైన రైళ్లను అధికారులు రద్దు చేశారు. గుంటూరు-విశాఖ సింహాద్రి, విశాఖ-లింగంపల్లి జన్మభూమి, విజయవాడ-విశాఖ రత్నాచల్, గుంటూరు-విశాఖ ఉదయ్, విశాఖ-తిరుపతి డబుల్ డెక్కర్, గుంటూరు-రాయగడ, విశాఖ-మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రైళ్లు, రాజమండ్రి-విశాఖ ప్యాసింజర్ను ఇరువైపులా రద్దు చేశారు.
Similar News
News December 1, 2025
14,967 ఉద్యోగాలు.. అప్లైకి 3రోజులే ఛాన్స్

కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయల్లో 14,967 (13,025 టీచింగ్, 1,942 నాన్ టీచింగ్) పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా మూడు రోజులే( DEC 4) సమయం ఉంది. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, ME, M.Tech, M.PEd, BCA, BE, B.Tech, CTET, B.PEd, B.LiSc, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్: kvsangathan.nic.in/ *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 1, 2025
కోహ్లీ 100 సెంచరీలు చేస్తారా?

SAపై నిన్న కోహ్లీ చెలరేగిన తీరు చూస్తే సచిన్ 100 సెంచరీల రికార్డును చేరుకోవడం కష్టం కాదేమో అని క్రీడా వర్గాల్లో టాక్ మొదలైంది. 2027 WCకు ముందు భారత్ ఇంకా 20 వన్డేలు ఆడనుంది. లీగ్లో ఫైనల్కు చేరితే మరో 5 నుంచి 10 మ్యాచులు ఆడే ఆస్కారం ఉంది. ప్రస్తుతం 83 శతకాలు బాదిన కోహ్లీ ఇక నుంచి ప్రతి 3 మ్యాచులకు 2 సెంచరీలు చేస్తే సచిన్ సరసన నిలిచే ఛాన్సుంది. మరి విరాట్ ఆ ఘనత సాధిస్తారా? మీ COMMENT.
News December 1, 2025
భారీ జీతంతో NTPCలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

<


