News June 30, 2024

సీబీడీటీ ఛైర్మన్‌గా రవి అగర్వాల్

image

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఛైర్మన్‌గా ఐఆర్ఎస్ అధికారి రవి అగర్వాల్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జులై ఒకటో తేదీన ఆయన బాధ్యతలు నిర్వహిస్తారు. కాగా 2023 నుంచి రవి అగర్వాల్ సీబీడీటీ సభ్యుడిగా పని చేస్తున్నారు. SEP 30తో ఆయన పదవీ కాలం ముగియనుండగా పొడిగించే అవకాశం ఉంది. ఇటు ప్రస్తుత ఛైర్మన్ నితిన్ గుప్తా పదవీకాలం నేటితో ముగియనుంది.

Similar News

News January 3, 2026

అకౌంట్‌లో పడిన ₹40Crతో ట్రేడింగ్.. హైకోర్టు ఏమందంటే?

image

ముంబైకి చెందిన గజానన్ అనే ట్రేడర్ టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కోటక్ సెక్యూరిటీస్ పొరపాటున ₹40Cr మార్జిన్‌ను అతడి అకౌంట్‌లో వేసింది. వాటితో ట్రేడింగ్ చేసి అతను 20 ని.ల్లో ₹1.75Cr లాభం పొందాడు. ఆ లాభాన్నీ తిరిగి పొందాలని బ్రోకరేజ్ సంస్థ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ట్రేడర్ నైపుణ్యం వల్ల ఆ లాభం వచ్చిందని, తదుపరి విచారణ (FEB 4) వరకూ అతని వద్దే ఉంచుకోవచ్చని మధ్యంతర తీర్పునిచ్చింది.

News January 3, 2026

గంజాయి తీసుకుంటూ దొరికిన BJP MLA కుమారుడు

image

TG: ఈగల్ టీమ్ తనిఖీల్లో BJP ఎమ్మెల్యే కుమారుడు పట్టుబడ్డారు. నానక్‌రామ్‌గూడలో నిర్వహించిన తనిఖీల్లో ఏపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి దొరికారు. తనిఖీల సమయంలో గంజాయి తీసుకుంటూ చిక్కిన ఆయనకు టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. ఆయనను ఈగల్ టీమ్ డీఅడిక్షన్ సెంటర్‌కు తరలించింది.

News January 3, 2026

మీడియా ముందుకు దేవా

image

TG: రాష్ట్రంలో పెద్దఎత్తున మావోయిస్టులు లొంగిపోయినట్లు DGP శివధర్ రెడ్డి పేర్కొన్నారు. కీలక నేతలు బర్సే దేవా, కంకనాల రాజిరెడ్డి, రేమలతో పాటు మరో 17మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలిపారు. వారు 48 తుపాకులు, 93 మ్యాగ్జిన్లు, 2206 బుల్లెట్స్, రూ.20,30,000 నగదు అప్పగించినట్లు వెల్లడించారు. దేవాపై రూ.75లక్షల రివార్డ్ ఉంది. ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మరణించిన అగ్రనేత హిడ్మాతో కలిసి దేవా 15 ఏళ్లు పనిచేశారు.