News April 2, 2024
MI కెప్టెన్సీ మార్పుపై రవిశాస్త్రి కామెంట్స్

ముంబై కెప్టెన్సీ మార్పుపై టీమ్ ఇండియా మాజీ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి స్పందించారు. ‘రోహిత్, హార్దిక్ కెప్టెన్సీల వ్యవహారంలో ఇంకా బెటర్గా వ్యవహరించి ఉంటే బాగుండేది. కానీ ఎవరిని కెప్టెన్ చేయాలనేది యజమానుల నిర్ణయం. వాళ్లే డబ్బులు ఖర్చు పెడతారు కాబట్టి వాళ్లిష్టం’ అని తెలిపారు. కాగా, ముంబై సారథిగా ఎవరు ఉండాలని స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన పోలింగ్లో రోహిత్కు 85%, పాండ్యకు 15% ఓట్లు వచ్చాయి.
Similar News
News December 1, 2025
BREAKING ప్రకాశం: క్రిస్మస్ ఏర్పాట్లు..ఇద్దరు మృతి.!

త్రిపురాంతకంలో సోమవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మండలంలోని కొత్త అన్నసముద్రంలో విద్యుత్ ఘాతానికి గురై ఎస్సీ కాలనీకి చెందిన ఇరువురు మృతి చెందారు. పచ్చిలగొర్ల విజయ్ (40) వీర్నపాటి దేవయ్య (35) సెమీ క్రిస్మస్ వేడుకలలో భాగంగా స్టార్ ఏర్పాటు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 1, 2025
14,967 ఉద్యోగాలు.. అప్లైకి 3రోజులే ఛాన్స్

కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయల్లో 14,967 (13,025 టీచింగ్, 1,942 నాన్ టీచింగ్) పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా మూడు రోజులే( DEC 4) సమయం ఉంది. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, ME, M.Tech, M.PEd, BCA, BE, B.Tech, CTET, B.PEd, B.LiSc, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్: kvsangathan.nic.in/ *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 1, 2025
కోహ్లీ 100 సెంచరీలు చేస్తారా?

SAపై నిన్న కోహ్లీ చెలరేగిన తీరు చూస్తే సచిన్ 100 సెంచరీల రికార్డును చేరుకోవడం కష్టం కాదేమో అని క్రీడా వర్గాల్లో టాక్ మొదలైంది. 2027 WCకు ముందు భారత్ ఇంకా 20 వన్డేలు ఆడనుంది. లీగ్లో ఫైనల్కు చేరితే మరో 5 నుంచి 10 మ్యాచులు ఆడే ఆస్కారం ఉంది. ప్రస్తుతం 83 శతకాలు బాదిన కోహ్లీ ఇక నుంచి ప్రతి 3 మ్యాచులకు 2 సెంచరీలు చేస్తే సచిన్ సరసన నిలిచే ఛాన్సుంది. మరి విరాట్ ఆ ఘనత సాధిస్తారా? మీ COMMENT.


