News April 10, 2024
తాను హాటీ అంటున్న రవిశాస్త్రి.. ఫొటో వైరల్

టీమ్ ఇండియా మాజీ ప్లేయర్, మాజీ కోచ్ రవిశాస్త్రి అప్‌లోడ్ చేసిన ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. స్నానం చేసే సమయంలో ధరించే దుస్తుల్ని వేసుకున్న ఫొటోను ఆయన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. దానికి ‘ఐయామ్ హాటీ, ఐయామ్ నాటీ, ఐయామ్ సిక్స్టీ’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో.. ఈ వయసులో ఇవేం వేషాలు అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇది కచ్చితంగా ఏదో యాడ్ ప్రమోషన్ కోసమేనని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.
Similar News
News February 3, 2026
BRIC THSTIలో ఉద్యోగాలు

BRIC THSTI 9 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 24 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి PhD(లైఫ్ సైన్సెస్, ఇమ్యునాలజీ, వైరాలజీ, వెటర్నరీ సైన్సెస్), MSc, MVSc, MTech, M.Pharmacy, MD/MDS/MPH, MBBS/BDS, DMLT, డిగ్రీ, ఇంటర్/ITI అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://thsti.res.in
News February 3, 2026
భారత్‌కు లభించిన బెస్ట్ డీల్ ఇది: పీయూష్

ప్రత్యర్థి దేశాలతో పోలిస్తే అమెరికాతో భారత్ చేసుకున్న డీల్ ఉత్తమమైనదని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ డీల్ నుంచి డెయిరీ, వ్యవసాయ రంగాలకు రక్షణ కల్పించినట్లు స్పష్టం చేశారు. లెదర్, జెమ్స్, ఇంజినీరింగ్ వంటి ప్రధాన ఎగుమతి రంగాలతో పాటు MSMEలకు ఇది మరిన్ని అవకాశాలను కల్పిస్తుందని తెలిపారు. ఈ డీల్ వల్ల అందరికీ లబ్ధి చేకూరుతుందని ధీమా వ్యక్తం చేశారు.
News February 3, 2026
ఆయిల్ కొనడం ఆపేస్తున్నట్లు ఇండియా మాకు చెప్పలేదు: రష్యా

రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపేస్తుందని ట్రంప్ చేసిన ప్రకటనపై మాస్కో స్పందించింది. దీనిపై తమకు IND నుంచి ఎలాంటి సమాచారం రాలేదని క్రెమ్లిన్ ప్రతినిధి పెస్కోవ్ తెలిపారు. US-ఇండియా సంబంధాలను తాము గౌరవిస్తామన్నారు. అయితే రష్యా-భారత్ మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం తమకు అంతకంటే ముఖ్యమని పేర్కొన్నారు. టారిఫ్స్ తగ్గింపునకు బదులుగా ఇండియా తమ నుంచి ఆయిల్ కొంటుందని ట్రంప్ ప్రకటించడం తెలిసిందే.


