News June 4, 2024
పవన్‌కు విషెస్ తెలిపిన రవితేజ, అల్లరి నరేశ్

పవర్ స్టార్ నుంచి జననేతగా మారిన పవన్ కళ్యాణ్‌కి సినీ ఇండస్ట్రీ నుంచి అభినందనలు వెల్లువెత్తున్నాయి. తాజాగా హీరోలు అల్లరి నరేశ్, రవితేజ ఆయన్ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ‘పిఠాపురం నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుపొందిన పవన్‌కి అభినందనలు. ఈ ప్రయాణంలో మీ పట్టుదలకు వందనాలు. మీరు మీ పెద్ద మనసుతో ప్రజలకు సేవ చేస్తూ అందరికి స్ఫూర్తిగా నిలవండి’ అని రవితేజ పేర్కొన్నారు.
Similar News
News January 20, 2026
‘జన నాయగన్’పై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

విజయ్ హీరోగా నటించిన ‘జన నాయగన్’ సినిమా సెన్సార్ వివాదంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ మూవీకి U/A సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సీబీఎఫ్సీ దాఖలు చేసిన అప్పీల్‌పై తీర్పును మద్రాస్ హైకోర్టు రిజర్వ్ చేసింది. చీఫ్ జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, జస్టిస్ జి. అరుల్ మురుగన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ముందు ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి. అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది.
News January 20, 2026
వెండితో వెడ్డింగ్ కార్డు.. ధర ఎంతో తెలిస్తే షాకే!

జైపూర్(RJ)లో ఓ తండ్రి తన కూతురి పెళ్లి కోసం ఏకంగా 3 కిలోల స్వచ్ఛమైన వెండితో వెడ్డింగ్ కార్డ్ చేయించారు. దీని ధర అక్షరాలా ₹25 లక్షలు. శివ్ జోహ్రీ అనే వ్యక్తి ఏడాది పాటు కష్టపడి, ఒక్క మేకు కూడా వాడకుండా 128 వెండి ముక్కలతో ఈ అద్భుతాన్ని సృష్టించారు. ఇందులో మొత్తం 65 మంది దేవుళ్ల ప్రతిమలను చెక్కించారు. తన కూతురి పెళ్లికి బంధువులతో పాటు సకల దేవతలను ఆహ్వానించాలనే ఉద్దేశంతోనే ఇలా చేశారట.
News January 20, 2026
చందనోత్సవానికి పటిష్ఠ ఏర్పాట్లు చేయాలి: మంత్రి డోలా

AP: సింహాచలం నరసింహస్వామి చందనోత్సవానికి పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని మంత్రి డోలా బాల వీరాంజనేయులు ఆదేశించారు. APR 20న చందనోత్సవం సందర్భంగా 19వ తేదీ రాత్రి 6గంటల నుంచే సాధారణ దర్శనాలు నిలిపివేస్తామని SM ద్వారా భక్తులకు తెలపాలన్నారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా అలర్ట్‌గా ఉండాలని చెప్పారు. FEBలో సమావేశానికి యాక్షన్ ప్లాన్‌తో రావాలని కలెక్టర్, ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో పేర్కొన్నారు.


