News June 11, 2024
రవితేజ, శ్రీలీల కొత్త సినిమా షురూ!

మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల కాంబోలో మరో సినిమా ప్రారంభమైంది. ‘RT75’ అనే వర్కింగ్ టైటిల్‌తో భాను భోగవరపు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ తెలంగాణ స్లాంగ్‌లో మాట్లాడనున్నట్లు టాక్. భీమ్స్ మ్యూజిక్ అందించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారట. కాగా గతంలో రవితేజ, శ్రీలీల కలిసి ‘ధమాకా’ సినిమాలో నటించారు. ఈ మూవీ రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది.
Similar News
News November 27, 2025
తూ.గో రైతులకు ముఖ్య గమనిక

ఖరీఫ్ ధాన్యం సేకరణకు సంబంధించి ఫిర్యాదులు, సందేహాల పరిష్కారం కోసం స్థానిక బొమ్మూరు కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కంట్రోల్ రూమ్ ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తుందని వెల్లడించారు. రైతులు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఏ సమస్య ఉన్నా 8309487151 నంబర్‌కు సంప్రదించి సహాయం పొందవచ్చని సూచించారు.
News November 27, 2025
పన్ను ఊడిపోయిందా? డెంటల్ ఇంప్లాంట్ అవసరం లేదు!

ఊడిపోయిన దంతాల ప్లేస్‌లో కొత్తవి వచ్చే విధంగా దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు బయోయాక్టివ్ ప్యాచ్‌ను ఆవిష్కరించారు. ఇది కృత్రిమ దంతాలకు ప్రత్యామ్నాయంగా దవడలోని స్టెమ్ సెల్‌లను చురుకుగా మారుస్తుంది. ఇది పూర్తి దంత నిర్మాణాన్ని సహజంగా పెంచుతుంది. పన్ను పోయిన చోట ఈ ప్యాచ్‌ను అమర్చితే చిగుళ్లలోపలి నుంచి కొత్త పన్ను వస్తుంది. మానవులపై జరిపే క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే ఎంతో మందికి ఇది ఉపయోగపడనుంది.
News November 27, 2025
జీవో 46పై విచారణ రేపటికి వాయిదా

TG: ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ఈ జీవో జారీ చేయడంతో వెనుకబడిన కులసంఘాలు పిటిషన్లు వేశాయి. పిటిషనర్ల తరఫున న్యాయవాది సుదర్శన్ అత్యవసర పిటిషన్‌గా విచారణ చేపట్టాలని కోరారు. బీసీలలో A, B, C, D వర్గీకరణ ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించాలని అభ్యర్థించారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను రేపటికి వాయిదా వేసింది.


