News August 14, 2024
రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ REVIEW&RATING

నిజాయితీ గల IT ఆఫీసర్ వ్యవస్థను ఎదుర్కొని ఏం చేయగలడనేది ‘మిస్టర్ బచ్చన్’ స్టోరీ. రవితేజ ఎనర్జీ, హీరోయిన్ గ్లామర్, ఎంటర్టైన్మెంట్తో ఫస్టాఫ్ హుషారుగా సాగుతుంది. మ్యూజిక్, సత్య కామెడీ, హీరో సిద్ధూ కనిపించే సీన్లు ఆకట్టుకుంటాయి. సెకండాఫ్ వచ్చేసరికి డైరెక్టర్ హరీశ్ శంకర్ డీలాపడ్డారు. సాగదీత, ఊహించే సీన్లు, ట్విస్టులు లేకపోవడం, పాత చింతకాయ పచ్చడి లాంటి స్టోరీ ఇబ్బంది పెడతాయి.
RATING: 2.5/5
Similar News
News October 26, 2025
తుఫాన్: ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు

AP: తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో అధికారులు పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
* 27, 28 తేదీలు: తూ.గో, అన్నమయ్య, కడప జిల్లాలు
* 27, 28, 29 తేదీలు: ఎన్టీఆర్, బాపట్ల, కృష్ణా, గుంటూరు జిల్లాలు
> కోనసీమ జిల్లాలో వర్షాల తీవ్రతను బట్టి సెలవు ప్రకటించాలని కలెక్టర్ ఆదేశించారు. అటు మరిన్ని జిల్లాలకు హాలిడే ఇచ్చే అవకాశం ఉంది.
News October 26, 2025
పశువుల పాలు పితికిన తర్వాత జాగ్రత్తలు

పాలు పితికిన తర్వాత పశువును అరగంట వరకు నేలపై పడుకోనీయకూడదు. పాలు పితకడం వల్ల పశువుల చనురంధ్రాలు తెరచుకొని ఉంటాయి. అప్పుడు ఆవు/గేదె పడుకుంటే ఆ రంధ్రాల నుంచి బ్యాక్టీరియా త్వరగా పొదుగులో చేరి పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఒక పశువు పాలు తీసిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కున్న తర్వాతే మరో పశువు పాలు తీయాలి. దీని వల్ల ఒక పశువుకు ఉన్న అంటువ్యాధులు ఇతర పశువులకు వ్యాపించే ముప్పు తగ్గుతుంది.
News October 26, 2025
నిమిషాల్లోనే అదృష్టం మారి’పోయింది’!

మధ్యప్రదేశ్కు చెందిన వినోద్ డోంగ్లీ అనే నోటరీ లాయర్ కొన్ని నిమిషాలపాటు బిలియనీర్గా మారారు. తన డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయగానే రూ.2,817 కోట్ల విలువైన 1,312 హర్సిల్ ఆగ్రో లిమిటెడ్ కంపెనీ షేర్లు కనిపించడంతో షాకయ్యాడు. ఇది నిజమే అని సంభ్రమాశ్చర్యంలో మునిగిపోగానే ఆ షేర్లన్నీ తన ఖాతాలోంచి మాయమైపోవడంతో కంగుతిన్నారు. టెక్నికల్ గ్లిచ్ వల్ల ఇలా జరగడంతో తన అదృష్టం కాసేపే అని నవ్వుకున్నారు.


