News November 6, 2024
‘ఆవేశం’ మూవీని రీమేక్ చేయనున్న రవితేజ?
మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించిన ‘ఆవేశం’ మూవీ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగు రైట్స్‌ను మాస్ మహారాజా రవితేజ కొనుగోలు చేశారని, దీనిని ఆయన రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ జరగనున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. జీతూ మాధవన్ ‘ఆవేశం’ మూవీని తెరకెక్కించగా ఈ ఏడాది ఏప్రిల్‌లో రిలీజై రూ.150కోట్లు వసూలు చేసింది.
Similar News
News November 6, 2024
ఆరోగ్యశ్రీపై ప్రభుత్వం కీలక నిర్ణయం!
TG: ఆరోగ్య శ్రీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేలా ఎంప్యానెల్ ఆస్పత్రుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం నిబంధనలను సులభతరం చేయనుంది. 50 పడకలు ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులకు ఎంప్యానెల్ అయ్యే అవకాశం కల్పించనున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న 347 ఆస్పత్రులకు మరో 150 జత అవుతాయి. ఆస్పత్రుల అనుమతులపై నిర్ణయం తీసుకునే ఎంప్యానెల్ డిసిప్లినరీ కమిటీని రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది.
News November 6, 2024
హైదరాబాద్‌లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం: టీడీపీ
AP: హైదరాబాద్‌లో మాజీ సీఎం ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తామని టీడీపీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ తెలిపారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన చోటే విగ్రహం ఆవిష్కరిస్తామని చెప్పారు. కాగా విగ్రహంతోపాటు కన్వెన్షన్ సెంటర్, మ్యూజియం కూడా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. విగ్రహ ఏర్పాటుపై సీఎం రేవంత్‌ను టీడీపీ నేతలు కలిసినట్లు సమాచారం.
News November 6, 2024
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రొహిబిషన్‌కు ఆమోదం పలికింది. ఏపీ ఎక్సైజ్ చట్టసవరణ ముసాయిదా, ఏపీ జీఎస్టీ 2024 చట్ట సవరణ, 2014-18 మధ్య నీరు-చెట్టు పెండింగ్ బిల్లుల చెల్లింపు, పనుల ప్రారంభానికి ఆమోదం తెలిపింది. CRDA పరిధి పెంపు, పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీకి ఆమోదం లభించింది.