News September 8, 2025
సంక్రాంతి బరిలో రవితేజ సినిమా?

కిశోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజయ్యే అవకాశాలున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. జనవరి 13వ తేదీని మూవీ టీమ్ ఖరారు చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఈ మూవీకి ‘అనార్కలి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. వచ్చే నెలాఖరులోగా షూటింగ్ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. కాగా రవితేజ నటించిన ‘మాస్ జాతర’ ఈ ఏడాది అక్టోబర్/ నవంబర్‌లో థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.
Similar News
News September 8, 2025
మధ్యాహ్నం 2గంటలకు కేటీఆర్ ప్రెస్ మీట్

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మధ్యాహ్నం 2గంటలకు తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికి మద్దతు ఇచ్చినా విమర్శలు తప్పవనే నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని కేటీఆర్ ప్రకటించనున్నట్లు రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.
News September 8, 2025
అధికారిక మీటింగ్‌లో సీఎం భర్త.. మండిపడ్డ ఆప్

ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై ఆమ్ ఆద్మీ పార్టీ ఫైర్ అయింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆమె భర్త మనీశ్ గుప్తా పాల్గొనడంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇది ‘పంచాయత్’ వెబ్ సిరీస్‌ను తలపిస్తోందని విమర్శించింది. అధికారిక మీటింగ్‌లో సీఎం పక్క ఛైర్‌లో ఆమె భర్త కూర్చున్న ఫొటోను Xలో షేర్ చేసింది. ఈ చర్య ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమని మండిపడింది.
News September 8, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోన్న బంగారం ధరలు ఇవాళ కాస్త తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.110 తగ్గి రూ.1,08,380కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.100 పతనమై రూ.99,350 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.1000 తగ్గి రూ.1,37,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.