News February 25, 2025
పట్టాలెక్కనున్న రవితేజ ‘డబుల్ ధమాకా’?

రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ‘ధమాకా’ 2022లో విడుదలై రూ.100 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘డబుల్ ధమాకా’ తెరకెక్కనున్నట్లు సమాచారం. దర్శకుడు త్రినాథరావు ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ చేశారని, మాస్ మహారాజా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని వార్తలు వస్తున్నాయి.
Similar News
News February 26, 2025
నాలుగు కాళ్లతో 17 ఏళ్ల బాలుడు.. సర్జరీ చేసిన AIIMS వైద్యులు

ఢిల్లీ AIIMS వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు. నాలుగు కాళ్లతో జన్మించి 17 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న UPకి చెందిన బాలుడికి కొత్త జీవితం ఇచ్చారు. పొట్టపై ఉన్న రెండు కాళ్లను విజయవంతంగా తొలగించారు. తల్లి కడుపులో కవలలు సంపూర్ణంగా ఎదగకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుందని డాక్టర్లు తెలిపారు. కోటి మందిలో ఒకరికి ఇలా జరుగుతుందని, ప్రపంచవ్యాప్తంగా 42 కేసులు మాత్రమే నమోదయ్యాయని చెప్పారు.
News February 26, 2025
భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు

ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI)లో 206 ఉద్యోగాలకు <
వెబ్‌సైట్: https://www.aai.aero/en/careers/
News February 25, 2025
ప్రశాంత్ ‘బ్రహ్మరాక్షస్’ మూవీలో ప్రభాస్?

హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నారని సమాచారం. త్వరలోనే లుక్ టెస్టులోనూ పాల్గొంటారని టాలీవుడ్ టాక్. బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో ప్రశాంత్ తీయాలనుకున్న ‘బ్రహ్మ రాక్షస్’ మూవీ మధ్యలో ఆగిపోయిన విషయం తెలిసిందే. అదే మైథలాజికల్ స్టోరీని డార్లింగ్ బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా మార్చుతున్నట్లు తెలుస్తోంది.