News July 17, 2024
ఈనెల 27న రవితేజ ‘విక్రమార్కుడు’ రీరిలీజ్

మాస్ మహారాజా రవితేజ, డైనమిక్ డైరెక్టర్ రాజమౌళి కాంబోలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘విక్రమార్కుడు’ను మరోసారి థియేటర్లలో చూసే అవకాశం వచ్చింది. ఈ నెల 27న ‘విక్రమార్కుడు’ను రీరిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 2006లో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ రవితేజ కెరీర్‌ను మలుపు తిప్పేసిందనే చెప్పాలి. MM కీరవాణి మ్యూజిక్ అందించిన ఈ మూవీ రీరిలీజ్‌కు మీరూ వెళ్తారా? కామెంట్ చేయండి.
Similar News
News November 14, 2025
రాష్ట్రంలో BAM ₹1.1 లక్షల కోట్ల పెట్టుబడి: లోకేశ్

AP: ప్రముఖ బ్రూక్‌ఫీల్డ్ అసెట్స్ మేనేజ్మెంట్(BAM) కంపెనీ రాష్ట్రంలో ₹1.1 లక్షల CR పెట్టుబడి పెట్టనుందని మంత్రి లోకేశ్ వెల్లడించారు. రెన్యువబుల్ ఎనర్జీ, బ్యాటరీ, పంప్డ్ స్టోరేజీ, సోలార్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో నిధులు వెచ్చించనుందని తెలిపారు. డేటా సెంటర్, రియల్ ఎస్టేట్, GCC, పోర్టులలోనూ పెట్టుబడి పెట్టనుందని ట్వీట్ చేశారు. వీటితో స్థిరమైన పెట్టుబడుల గమ్యస్థానంగా AP మారుతుందని పేర్కొన్నారు.
News November 14, 2025
బీజేపీకి షాక్.. డిపాజిట్ గల్లంతు

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి డిపాజిట్ దక్కించుకోలేకపోయారు.
News November 14, 2025
శ్రీమహావిష్ణువు అనుగ్రహాన్ని పొందాలంటే?

తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయం|
ధ్యాయన్ స్తువన్నమస్యంశ్చ యజమానస్తమేవ చ||
శాశ్వతమైన పరమాత్మను నిరంతరం ఆరాధించాలని, ఆయననే ప్రధానంగా పూజించాలని ఈ శ్లోకార్థం. భగవంతుడ్ని ధ్యానిస్తూ, స్తుతిస్తూ, నమస్కరిస్తూ, ప్రతి కర్మనూ అంకితం చేయాలి. ప్రతి ఆలోచన ఆ పరమాత్మకే అర్పించాలి. తద్వారానే ఆయన అనుగ్రహం పొందగలం. అందుకే అనుక్షణం పరమాత్మ చింతనతో జీవించాలని పండితులు చెబుతారు.<<-se>>#VISHNUSAHASRANAMAM<<>>


