News October 1, 2024
రవిచంద్రన్ అశ్విన్ మరో ప్రపంచ రికార్డు

టీమ్ ఇండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. టెస్టుల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్న క్రికెటర్గా ముత్తయ్య మురళీధరన్తో కలిసి అగ్రస్థానంలో నిలిచారు. వీరిద్దరూ చెరో 11 సార్లు POTS సాధించారు. కాగా బంగ్లాదేశ్తో జరిగిన సిరీస్లో అశ్విన్ అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఒక సెంచరీతోపాటు 11 వికెట్లు కూడా తీశారు.
Similar News
News November 25, 2025
హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి: సిద్దరామయ్య

CM మార్పు విషయంలో గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలని కర్ణాటక సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. ఢిల్లీకి వెళ్లే స్వేచ్ఛ ఎమ్మెల్యేలకు ఉందని, వారు తమ అభిప్రాయాలు చెప్పుకోవచ్చని అన్నారు. అధిష్ఠానం నుంచి సిగ్నల్ రాగానే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపడతామని పేర్కొన్నారు. మరోవైపు తాను పార్టీ నుంచి ఏమీ డిమాండ్ చేయడం లేదని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పారు.
News November 25, 2025
UIDAIలో టెక్నికల్ కన్సల్టెంట్ ఉద్యోగాలు

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(<
News November 25, 2025
ఆకుకూరల సాగు- అనువైన నేలలు, వాతావరణం

తక్కువ సమయంలో రైతు చేతికొచ్చి, నిరంతరం ఆదాయం అందించే పంటల్లో ఆకుకూరలు ముందుంటాయి. ఆకుకూరలను మురుగు నీరు ఇంకిపోయే అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. నేల ఉదజని సూచిక 6.0 నుంచి 7.5గా ఉండాలి. వానాకాలం, వేసవి కాలం, 16 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న సమయం ఆకుకూరల పంటలు పెరగడానికి అత్యంత అనుకూలం. 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటే తోటకూరను సాగు చేయడం కష్టం.


