News September 27, 2024

రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త ఘనత

image

టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ మరో ఘనత సాధించారు. ఆసియాలో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఆయన నిలిచారు. ఇప్పటివరకు ఆయన 420 వికెట్లు పడగొట్టారు. బంగ్లాతో జరుగుతున్న రెండో టెస్టులో అశ్విన్ ఈ ఘనత సాధించారు. అగ్ర స్థానంలో ముత్తయ్య మురళీధరన్(612 వికెట్లు)ఉన్నారు. వీరిద్దరి తర్వాత అనిల్ కుంబ్లే(419), రంగనా హెరాత్(354), హర్భజన్(300) ఉన్నారు.

Similar News

News November 18, 2025

నీటి వాడుక లెక్కలు తేల్చేందుకు AP సహకరించడం లేదు: ఉత్తమ్

image

కృష్ణా జలాల వినియోగాన్ని తెలుసుకొనేలా టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు AP సహకరించడం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ‘నీటిని ఏ రాష్ట్రం ఎంత వినియోగిస్తోందో తెలుసుకొనేందుకు 18 టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటుచేశాం. మరో 20 ఏర్పాటుకావాలి. వీటి ఏర్పాటుకు ఏపీ ముందుకు రావడం లేదు. తన వాటా నిధులూ ఇవ్వడం లేదు. స్టేషన్ల ఏర్పాటుకు ఆ నిధులనూ మేమే ఇస్తామని కేంద్రానికి చెప్పా’ అని ఉత్తమ్ పేర్కొన్నారు.

News November 18, 2025

బస్సుకు మంటలు.. 45 మందిని కాపాడిన కానిస్టేబుల్

image

AP: నెల్లూరు జిల్లా సంగం హైవేపై పెను ప్రమాదం తప్పింది. 45 మందితో వెళ్తున్న ఆర్టీసీ బస్సు కింద మంటలు చెలరేగాయి. అదే రోడ్డుపై వెళ్తున్న సంగం కానిస్టేబుల్ నాగార్జున వెంటనే డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. బస్సును నిలిపివేసిన డ్రైవర్ ప్రయాణికులను సురక్షితంగా కిందకి దించేశాడు. దీంతో ఘోర ప్రమాదం తప్పిందని అంతా ఊపిరిపీల్చుకున్నారు. అప్రమత్తం చేసిన కానిస్టేబుల్‌ను అభినందించారు.

News November 18, 2025

సింహ ద్వారం వాస్తు ప్రకారం లేకపోతే?

image

మిగతా గృహ నిర్మాణం అంతా వాస్తు ప్రకారం ఉంటే సింహద్వారం ప్రభావం కొద్దిగా తగ్గుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇతర విషయాలన్నీ అనుకూలంగా ఉంటూ సింహ ద్వారం వాస్తు ప్రకారం లేకపోయినా పెద్దగా దోషం ఉండదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు తెలిపారు. ‘వ్యక్తిగత పేరు, జన్మరాశి ఆధారంగా సింహద్వారం ప్రభావాన్ని తెలుసుకోవచ్చు. వాస్తుపరమైన ఇతర సానుకూలతలు ఈ లోపాన్ని అధిగమించడంలో సహాయపడతాయి’ అని సూచించారు. <<-se>>#Vasthu<<>>