News July 17, 2024
త్వరలో APకి ఆకే రవికృష్ణ

AP: కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్గా ఉన్న ఆంధ్రా క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆకే రవికృష్ణ మరికొన్ని రోజుల్లో ఏపీకి రానున్నారు. ఈ మేరకు ఆయన్ను పంపించే ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. ఏపీలో డ్రగ్స్ నియంత్రణకోసం ఏర్పాటు కానున్న యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ బాధ్యతల్ని ఆయనకు అప్పగించే అవకాశముంది. 2006 బ్యాచ్కు చెందిన రవికృష్ణ 2018 నుంచి ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తున్నారు.
Similar News
News November 24, 2025
రైతుల ఇబ్బందులను తెలుసుకున్న మంత్రి నాదెండ్ల

భీమడోలు మండలం గుండుగొలను ఖరీఫ్ వరి ధాన్యం పట్టుబడి పడుతున్న రైతులను రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ కలిశారు. ఈమేరకు ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఉన్న ఇబ్బందులు రైతులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రైతుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సమర్థంగా అమలవుతున్నాయా అన్న అంశాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే ధర్మరాజు ఉన్నారు.
News November 24, 2025
టమాటా కేజీ రూ.80!

TG: నిన్న, మొన్నటి వరకు కేజీ రూ.20-40కే లభించిన టమాటా ఇప్పుడు కొండెక్కింది. ప్రస్తుతం కిలో రూ.60 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. దీంతో మార్కెట్లలో టమాట రేటు చూసి సామాన్యులు నోరెళ్లబెడుతున్నారు. కొన్ని మార్కెట్లలో అయితే టమాటానే దొరకడం లేదు. ధర వెచ్చించలేక వ్యాపారులు కొనుగోలు చేయడంలేదు. ఇటీవల మొంథా తుఫాన్ ప్రభావంతో టమాట పంటలు తీవ్రంగా దెబ్బ తినడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు తెలిపారు.
News November 24, 2025
తమిళనాడుకు భారీ వర్ష సూచన.. విద్యాసంస్థలకు సెలవులు

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరించడంతో 18 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సోమవారం సెలవులు ప్రకటించారు. ఒకేసారి 2 సైక్లోనిక్ తుఫానులు రావడంతో తమిళనాడులో భారీ వర్షాలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే తెంకాసి, తిరునల్వేలి, తూత్తుకుడి సహా పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.


