News February 6, 2025
చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా

రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించారు. అన్ని ఫార్మాట్లలో కలిపి 6,000 పరుగులు, 600 వికెట్లు తీసిన ఏకైక భారత స్పిన్నర్‌గా (కపిల్ దేవ్ తర్వాత రెండో క్రికెటర్) నిలిచారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆయన ఈ ఘనత సాధించారు. మరోవైపు ఇంగ్లండ్-భారత్ మధ్య జరిగిన వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ ఫీట్ సాధించారు. ఇప్పటివరకు ఆయన 41 వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో జేమ్స్ అండర్సన్(40)ను ఆయన అధిగమించారు.
Similar News
News November 23, 2025
ఏటూరునాగారం: బియ్యం ఇవ్వాలంటే వాగు దాటాల్సిందే..!

ఏటూరునాగారం మండలంలో కొండాయి, మల్యాల గ్రామాల్లోని గిరిజనులకు జీసీసీ రేషన్ బియ్యం అందించడం విక్రయదారులకు సవాలుగా మారింది. ఈ ప్రాంతంలోని ప్రజలకు బియ్యం ఇవ్వాలంటే సేల్స్‌మెన్ వినయ్ కుమార్ వాగు దాటి, వేయింగ్ మెషిన్ పట్టుకొని మూడు కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా ఇదే పరిస్థితి ఉందని వినయ్ తెలిపారు. రవాణా సౌకర్యం లేక ఈ ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు.
News November 23, 2025
వాహనదారులకు అలర్ట్.. ఓవర్‌లోడ్‌తో పట్టుబడితే..

TG: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆకస్మిక తనిఖీల కోసం 33 జిల్లా, 3 రాష్ట్ర స్థాయి స్క్వాడ్లను ఏర్పాటు చేసింది. గత 10రోజుల్లో 4,748 కేసులు నమోదవగా, 3,420 వాహనాలు సీజ్ చేశారు. ఓవర్‌లోడ్‌తో వెళ్తూ తొలిసారి పట్టుబడితే వెహికల్ సీజ్ చేస్తారు. రెండో సారి పర్మిట్, డ్రైవర్ లైసెన్స్ రద్దు చేస్తారు. ఇకపై లైసెన్స్ రెన్యువల్ టైంలో భారీ వాహనాల డ్రైవర్లకు రీఫ్రెషర్ ట్రైనింగ్ ఉంటుంది.
News November 23, 2025
జట్టులోకి గిల్ రీఎంట్రీ అప్పుడేనా?

టీమ్ ఇండియా టెస్ట్, ODI కెప్టెన్ గిల్ SAతో జరిగే ODI, T20 సిరీస్‌లో ఆడటం కష్టమని క్రీడా వర్గాలు వెల్లడించాయి. మెడ నొప్పి నుంచి ఆయన పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం పట్టొచ్చని పేర్కొన్నాయి. 2026 జనవరి 11 నుంచి NZతో జరిగే ODI సిరీస్‌లో ఆయన రీఎంట్రీ ఇస్తారని తెలిపాయి. కాగా SAతో ODI, T20 సిరీస్‌కు BCCI ఇవాళ జట్టును ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ODIలకు KL/అక్షర్/పంత్‌లో ఒకరు కెప్టెన్సీ చేసే ఛాన్సుంది.


