News August 22, 2024
అర్ధరాత్రి నుంచి ప్రైమ్లో ‘రాయన్’ స్ట్రీమింగ్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన రాయన్ మూవీ ఇవాళ అర్ధరాత్రి OTTలోకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. ఇద్దరు తమ్ముళ్లు, చెల్లి కోసం హీరో ఎలాంటి పోరాటం చేశారు? అనే కథాంశంతో మూవీ తెరకెక్కింది. రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి సూపర్ హిట్గా నిలిచింది. అపర్ణ, సందీప్ కిషన్, దుషారా విజయన్ కీలక పాత్రల్లో నటించారు.
Similar News
News November 6, 2025
MOILలో 99 ఉద్యోగాలు

మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్(<
News November 6, 2025
‘బాహుబలి-ది ఎపిక్’.. రూ.50 కోట్లు దాటిన కలెక్షన్లు!

బాహుబలి-ది ఎపిక్ సినిమా కలెక్షన్లు రూ.50 కోట్లు దాటినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. 6 రోజుల్లో దాదాపు రూ.53 కోట్ల వరకు గ్రాస్ వచ్చినట్లు పేర్కొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.20 కోట్లకు పైగా, కర్ణాటకలో రూ.5 కోట్లు, విదేశాల్లో రూ.12 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం వసూళ్లు రూ.60 కోట్లు దాటొచ్చని అంచనా వేస్తున్నారు.
News November 6, 2025
బిహార్ అప్డేట్: 11 గంటల వరకు 27.65% పోలింగ్

బిహార్లో మొదటి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 27.65 శాతం పోలింగ్ నమోదైంది. కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులుదీరారు. సీఎం నితీశ్ కుమార్, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, ఆర్జేడీ నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.


