News September 3, 2025
ప్రపంచ నంబర్‌వన్ ఆల్‌రౌండర్‌గా రజా

ఐసీసీ వన్డే ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో జింబాబ్వే క్రికెటర్ సికిందర్ రజా అగ్రస్థానంలో నిలిచారు. 302 పాయింట్లతో ఆయన టాప్ ర్యాంక్ కైవసం చేసుకున్నారు. టాప్-5లో ఒమర్జాయ్, మహ్మద్ నబీ, మెహిదీ హసన్, బ్రేస్‌వెల్ ఉన్నారు. భారత్ నుంచి టాప్-10లో రవీంద్ర జడేజా(9) ఒక్కరే ఉన్నారు. బ్యాటర్ల జాబితాలో గిల్, రోహిత్ టాప్-2లో ఉన్నారు. అలాగే బౌలింగ్ విభాగంలో కేశవ్ మహరాజ్(సౌతాఫ్రికా) అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
Similar News
News January 31, 2026
స్కూళ్లలో ‘ఆధార్’ క్యాంపులు

TG: విద్యార్థుల ఆధార్ రిజిస్ట్రేషన్, అప్‌డేట్ కోసం స్కూళ్లలో స్పెషల్ ఆధార్ మొబైల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఈ సెంటర్లు ఎప్పుడు, ఏ స్కూలులో ఉంటాయో తెలుసుకునేందుకు డీఈవో, ఎంఈవోలను సంప్రదించాలని సూచించింది. 5-15, 15-17 ఏళ్ల వయసున్న అన్ని స్కూళ్ల విద్యార్థుల ఫస్ట్ బయోమెట్రిక్ అప్‌డేట్ ఉచితమని, రెండోసారి అయితే ₹125, వివరాల మార్పునకు ₹75 చెల్లించాలని అధికారులు తెలిపారు.
News January 31, 2026
శని త్రయోదశి నాడు పఠించాల్సిన శ్లోకం

నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్|
ఛాయా మార్తాండ సంభూతుడు తం నమామి శనైశ్చరమ్||
నేడు ఈ శ్లోకాన్ని కనీసం 11 సార్లు పఠించడం వల్ల శని గ్రహ పీడలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు. అలాగే ‘‘ఓం ప్రాం ప్రీం ప్రౌం సః శనైశ్చరాయ నమః” అనే మంత్రాన్ని పఠించాలంటున్నారు. ‘‘ఓం నమః శివాయ’’ పంచాక్షరీ మంత్రాన్ని జపించినా విశేష ఫలితాలుంటాయని, వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని సూచిస్తున్నారు.
News January 31, 2026
యాంగ్జైటీని తగ్గించే ముద్ర

ఒత్తిడి వల్ల ప్రస్తుతకాలంలో చాలామంది యాంగ్జైటీకి గురవుతున్నారు. దీనికి వజ్ర పద్మ ముద్ర పరిష్కారం చూపుతుంది. రెండు చేతుల వేళ్లనూ ఒకదానితో ఒకటి కలిపి బొటనవేలును కూడా దగ్గరగా పెట్టుకోవాలి. ఛాతీభాగానికి అంటించకుండా కొద్ది దూరానుంచాలి. కళ్లు మూసుకుని మెల్లగా శ్వాసపై ధ్యాస పెట్టాలి. యాంగ్జైటీ ఎక్కువగా ఉన్నవాళ్లు రోజుకు 5నిమిషాల చొప్పున మూడుపూటలా చేయండి. దీన్ని తినగానే మాత్రం చేయకూడదు.


