News February 7, 2025

RBI బూస్ట్: తగ్గనున్న EMI భారం

image

ఐదేళ్ల తర్వాత RBI రెపోరేటును తగ్గించడంతో రుణగ్రహీతలకు ఊరట లభించనుంది. బెంచ్‌మార్క్ ఫ్లోటింగ్ రేటు ఆధారంగా హోమ్, ఇతర లోన్లు తీసుకున్న కస్టమర్లకు EMI భారం తగ్గనుంది. కనీసం 25 బేసిస్ పాయింట్ల మేర ఉపశమనం దొరకనుంది. RBI రెపోరేటును తగ్గించినప్పుడు లోన్లపై వడ్డీరేట్లు తగ్గుతాయి. పెరిగితే బ్యాంకులు ఆ మేరకు కస్టమర్లపై భారం వేస్తాయి. తాజా తగ్గింపుతో ఇకపై తీసుకొనే రుణాల భారమూ తగ్గనుంది.

Similar News

News February 7, 2025

చేతిరాత మార్చుకోలేకపోయా: మోదీ

image

తన విద్యార్థి దశలో చేతిరాత బాగుండేది కాదని, దానిని మార్చడానికి ఉపాధ్యాయులు చాలా శ్రమించేవారని ప్రధాని మోదీ విద్యార్థులకు తెలిపారు. అయినప్పటికీ చేతిరాత మారలేదన్నారు. ఫిబ్రవరి 10న ‘పరీక్షా పే చర్చ’ జరగనున్ననేపథ్యంలో ఢిల్లీలోని సుందర్ నర్సరీలో విద్యార్థులతో చర్చాకార్యక్రమం నిర్వహించారు. ఈసారి ‘పరీక్షా పే చర్చా’లో దీపికా పదుకొణే, బాక్సర్ మేరీకోమ్‌లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.

News February 7, 2025

అత్యధిక విద్యావంతులున్న దేశాలివే!

image

ప్రపంచంలోనే జపాన్‌లో అత్యధికంగా విద్యావంతులు ఉన్నట్లు తాజాగా విడుదలైన ఓ నివేదికలో వెల్లడైంది. ఇండియా 53వ స్థానంలో ఉండగా చైనా 27, అమెరికా 22వ స్థానాల్లో ఉన్నాయి. విద్యావంతులు కలిగిన దేశాల జాబితా వరుసగా.. జపాన్, స్వీడన్, స్విట్జర్లాండ్, జెర్మనీ, డెన్మార్క్, కెనడా, నార్వే, నెదర్లాండ్స్, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా, యూకే, ఫ్రాన్స్, సౌత్ కొరియా, ఐర్లాండ్, ఇటలీ, USA, స్పెయిన్, చైనా, రష్యా, UAE ఉన్నాయి.

News February 7, 2025

Stock Markets: పుంజుకొని మళ్లీ పడిపోయిన సూచీలు

image

నేడు బెంచ్‌మార్క్ సూచీలు స్వల్పంగా నష్టపోయాయి. నిఫ్టీ 23,559 (-43), సెన్సెక్స్ 77,860 (-197) వద్ద ముగిశాయి. రెపోరేటు తగ్గించడంతో పుంజుకున్న సూచీలు మధ్యాహ్నం ఇంట్రాడే కనిష్ఠానికి చేరాయి. ఆఖర్లో కాస్త పెరిగి నష్టాలను తగ్గించుకున్నాయి. బ్యాంకు, ఫైనాన్స్, FMCG, O&G షేర్లు పడిపోయాయి. మెటల్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆటో షేర్లు ఎగిశాయి. టాటాస్టీల్, ITC హోటల్స్, AIRTEL, JSW స్టీల్, TRENT టాప్ గెయినర్స్.

error: Content is protected !!