News September 13, 2024

బ్యాంకులకు ఆర్బీఐ గవర్నర్ హెచ్చరిక

image

కమర్షియల్ రియల్ ఎస్టేట్ (CRE) ప్రాజెక్టులకు బ్యాంకులు ఎక్కువ రుణాలు ఇవ్వడం ఆందోళనకరమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. షార్ట్ సెల్లర్లకు ఇది లక్ష్యంగా మారొచ్చని హెచ్చరించారు. ‘లోన్‌బుక్స్‌లో అధిక CRE రేషియో వల్ల అంచనా వేయగలిగే, వేయలేని CRE నష్టాలతో బ్యాంకులకు ఇబ్బందే. వీటితో లిక్విడిటీ ఆగిపోతే షార్ట్ సెల్లర్లు టార్గెట్ చేస్తారు. దాంతో ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ మరింత తగ్గుతుంది’ అని అన్నారు.

Similar News

News November 20, 2025

iBOMMA Oneపై పోలీసుల రియాక్షన్‌

image

iBOMMA One పైరసీ వెబ్‌సైట్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు స్పష్టత ఇచ్చారు. ఆ సైట్‌లో కొత్త సినిమాలు పైరసీ సినిమాలు లేవని తెలిపారు. సినిమాలకు సంబంధించిన రివ్యూలు మాత్రమే ఉన్నాయని, తెరవడానికి ప్రయత్నిస్తే కూడా సైట్ ఓపెన్ కాకపోగా, ఏ ఇతర పైరసీ సైట్లకు రీడైరెక్ట్ అవ్వడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికే iBOMMA, BAPPAM వంటి వెబ్‌సైట్లను బ్లాక్ చేసినట్లు చెప్పారు.

News November 20, 2025

పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయా? ఇలా తెలుసుకోండి!

image

నిన్న ప్రధాని మోదీ పీఎం కిసాన్ 21వ విడత నిధులను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2వేల చొప్పున రూ.18వేల కోట్లు జమ చేశారు. భూమి వివరాలు PM-KISAN పోర్టల్‌లో నమోదై ఉండి, బ్యాంక్ అకౌంట్ ఆధార్‌తో లింక్ అయి ఉన్న రైతులకే ఈ స్కీమ్ ప్రయోజనాలు అందనున్నాయి. https://pmkisan.gov.in/లోకి వెళ్లి మీ ఖాతాలో డబ్బులు పడ్డాయో, లేదో తెలుసుకోవచ్చు.

News November 20, 2025

దేశవ్యాప్తంగా సన్న బియ్యం ఇవ్వాలని కేంద్ర మంత్రికి CM విజ్ఞప్తి

image

దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషీకి CM రేవంత్‌ వివరించారు. HYDలో ఆయనతో సీఎం భేటీ అయ్యారు. ప్రజలు తినే బియ్యాన్ని సరఫరా చేస్తేనే సంక్షేమ పథకం ఉద్దేశం నెరవేరుతుందని, దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ అంశాన్ని పరిశీలించాలని కోరారు. పూర్తిస్థాయి అధ్యయనం తర్వాత పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి తెలిపారు.