News October 6, 2024
RBI వడ్డీరేట్ల కోత లేనట్టేనా!

RBI MPC అక్టోబర్ మీటింగ్‌లో రెపోరేట్ల కోత ఉండకపోవచ్చని సమాచారం. రిటైల్ ఇన్‌ఫ్లేషన్ ఇంకా ఆందోళనకరంగానే ఉన్నట్టు కమిటీ భావిస్తోందని తెలిసింది. వెస్ట్ ఏషియాలో యుద్ధంతో క్రూడాయిల్ ధరలు ఎగిశాయి. దీంతో ఆహార పదార్థాలు, ఇతర వస్తువుల ధరలు పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే వడ్డీరేట్ల కోత కోసం డిసెంబర్ వరకు వేచి చూడాల్సిందే. 2023, ఫిబ్రవరి నుంచి రెపోరేట్ 6.5 శాతంగా ఉంది.
Similar News
News July 6, 2025
బిర్యానీ అంటే.. అదో ఎమోషన్!

‘వరల్డ్ బిర్యానీ డే’ ఒకటుందని తెలుసా? జులైలో తొలి ఆదివారాన్ని బిర్యానీ డేగా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లమందికి బిర్యానీ అనేది ఒక ఎమోషన్. ఇది పర్షియా నుంచి ఉద్భవించిందని, మొఘలులు భారత్‌కు తెచ్చారని నమ్ముతారు. ఇందులో హైదరాబాదీ బిర్యానీ, లక్నో, కోల్‌కతా అంటూ చాలానే రకాలున్నాయి. వీటికి అదనంగా ఫ్రై పీస్, ఉలవచారు అంటూ మనోళ్లు చాలానే కనిపెట్టారు. మరి.. మీకే బిర్యానీ ఇష్టం? COMMENT చేయండి.
News July 6, 2025
31 నుంచి సికింద్రాబాద్‌లో అగ్నివీర్ ర్యాలీ

TG: ఈనెల 31 నుంచి సికింద్రాబాద్ AOC సెంటర్‌లోని జోగిందర్ స్టేడియంలో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. జనరల్ డ్యూటీ(జీడీ), టెక్నికల్, క్లర్క్, ట్రేడ్స్‌మెన్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈవెంట్లు SEP 14 వరకు కొనసాగుతాయి. అటు వివిధ కేటగిరీల్లో అత్యుత్తమ క్రీడాకారులకు ప్రత్యేక స్పోర్ట్స్ ట్రయల్స్ కూడా నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు AOC సెంటర్ హెడ్‌క్వార్టర్‌ను లేదా <
News July 6, 2025
బౌద్ధమత గురువు దలైలామా 90వ జన్మదినం

బౌద్ధమత అత్యున్నత ఆధ్యాత్మిక గురువు 14వ దలైలామా నేడు 90వ జన్మదినం జరుపుకుంటున్నారు. టిబెట్‌లోని సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన టెన్జింగ్ గ్యాట్సో కేవలం ఐదేళ్ల వయసులోనే 14వ దలైలామా అయ్యారు. చైనా ఆక్రమణ తర్వాత 1959లో ఇండియాకి నిర్వాసితుడిగా వచ్చారు. తన సందేశాలతో 1989లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. ‘మనసు ప్రశాంతంగా ఉంటే, ప్రపంచమూ ప్రశాంతంగా ఉంటుంది’ అన్న ఆయన మాటలు ఇప్పుడు అన్ని దేశాలకు అవసరం.