News June 23, 2024

బుమ్రా జట్టుకు RBI లాంటి వ్యక్తి: ఇర్ఫాన్ పఠాన్

image

T20WCలో తన పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతున్న బుమ్రాపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు కురిపించారు. ‘అతను జట్టుకు RBI లాంటి వ్యక్తి. ఎలాంటి పరిస్థితుల్లో 4 ఓవర్లు బౌలింగ్ చేసినా రాణిస్తాడు. ఆటపై తీవ్ర ప్రభావం చూపిస్తాడు. బౌన్సర్లపై ఎక్కువగా ఆధారపడకుండా లైన్ అండ్ లెంగ్త్‌ను కొనసాగిస్తాడు’ అని పేర్కొన్నారు. కాగా బుమ్రా WCలో 19 ఓవర్లలో 65 పరుగులే ఇచ్చి 10 వికెట్లు తీశారు.

Similar News

News January 3, 2025

రైతులకు రూ.20,000.. ఎప్పుడంటే?

image

AP: అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రైతులకు ఏడాదికి రూ.20,000 చొప్పున సాయం చేసే ఈ పథకాన్ని PM కిసాన్ నిధులు ఎప్పుడు విడుదల చేస్తే అప్పుడు అమలు చేయాలని నిర్ణయించింది. PM కిసాన్‌ను ₹6వేల నుంచి కేంద్రం ₹10వేలకు పెంచనుందని, దానికి రాష్ట్ర ప్రభుత్వం ₹10వేలు కలిపి మొత్తం ₹20వేలు ఇస్తామని CM CBN చెప్పారు. 3 విడతల్లో కేంద్రం ఎంత ఇస్తుందో రాష్ట్రమూ అంతే మొత్తంలో ఇవ్వనుంది.

News January 3, 2025

జియో రూ.40,000 కోట్ల IPO

image

రిలయన్స్ జియో IPOకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని ద్వారా రూ.40,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే జరిగితే స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద IPOగా రిలయన్స్ జియో పేరు నిలిచిపోతుంది. ఇందుకోసం సంస్థ విలువను రూ.10లక్షల కోట్లుగా చూపించనున్నట్లు తెలుస్తోంది. మే/జూన్ తర్వాత ఈ IPO మార్కెట్లోకి వచ్చే ఛాన్సుంది.

News January 3, 2025

BREAKING: కష్టాల్లో భారత్

image

ఆసీస్‌తో జరుగుతున్న 5వ టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. 72 పరుగులకే కీలకమైన 4 వికెట్లను కోల్పోయింది. లంచ్ బ్రేక్‌కు మూడు వికెట్లు పడగా, ఆ తర్వాత బోలాండ్ బౌలింగ్‌లో ఎప్పటిలాగే కోహ్లీ(17) స్లిప్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆఫ్ సైడ్ వెళ్లే బంతిని అనవసర షాట్‌కు యత్నించి విరాట్ వికెట్ సమర్పించుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో పంత్(9), జడేజా(0) ఉన్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు 76/4.