News December 5, 2024
RBI వడ్డీరేటును 100 BPS తగ్గించొచ్చు: నొమురా

జపనీస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు నొమురా భారతీయుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. రెపోరేటును RBI 100 బేసిస్ పాయింట్ల మేర తగ్గించొచ్చని అంచనా వేసింది. ఇక FY25 GDP అంచనాను 6 శాతానికి తగ్గించింది. మరోవైపు ఇతర సంస్థలు రెపోరేటును 50 BPS కత్తిరిస్తుందని, GDPని 6.9%గా అంచనా వేయడం గమనార్హం. 2023 FEB నుంచి RBI వడ్డీరేటును 6.5% వద్దే కొనసాగిస్తోంది. దీనిని తగ్గించి లిక్విడిటీని పెంచాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Similar News
News November 24, 2025
పుట్టపర్తిలో ఉత్సవాలు బ్లాక్బస్టర్!

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఈనెల 13న మొదలై 23న విజయవతంగా ముగిశాయి. లక్షలాది మంది భక్తులు, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు వేడుకల్లో పాల్గొని బాబాను స్మరించుకున్నారు. ఉత్సవాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత కచేరీ, లేజర్ షో ఈవెంట్స్ భక్తులను మైమరపించాయి. జిల్లా అధికారులు, పోలీసులు, సాయి సేవాదళ్ సభ్యులు విశేష సేవలందించి శత జయంతిని సక్సెస్ చేశారు.
News November 24, 2025
BELOPలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

BEL ఆప్ట్రోనిక్ డివైసెస్ లిమిటెడ్(<
News November 24, 2025
భారత్కు మరో ఓటమి తప్పదా?

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు ఓడిన టీమ్ఇండియా రెండో టెస్టులోనూ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. తొలి ఇన్నింగ్సులో 201 పరుగులకే ఆలౌటై సఫారీలకు 288 రన్స్ ఆధిక్యాన్ని కట్టబెట్టింది. అటు రేపు, ఎల్లుండి ఆట మిగిలి ఉండటంతో దూకుడుగా ఆడి <<18376327>>లీడ్<<>> పెంచుకోవాలని సఫారీ జట్టు చూస్తోంది. రెండో ఇన్నింగ్సులోనూ భారత ప్లేయర్లు ఇదే ప్రదర్శన చేస్తే 0-2తో సిరీస్ను చేజార్చుకునే ప్రమాదముంది. దీంతో WTCలో స్థానం దిగజారనుంది.


