News September 6, 2024

RBI క్విజ్.. రూ.10 లక్షలు గెలుచుకునే ఛాన్స్

image

RBI ఏర్పడి వచ్చే ఏడాది APR1 నాటికి 90 ఏళ్లు పూర్తి కానుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా డిగ్రీ స్థాయి విద్యార్థులకు ‘RBI 90’ పేరుతో క్విజ్ పోటీలు నిర్వహిస్తోంది. ఈ నెల 17 వరకు <>https://www.rbi90quiz.in<<>>లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 19-21 మధ్య ఉ.9 నుంచి రా.9 వరకు పోటీలు జరగనున్నాయి. 4 దశల్లో ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది. తొలి 3 స్థానాల్లో నిలిచినవారికి రూ.10 లక్షలు, రూ.8లక్షలు, రూ.6 లక్షల బహుమతి ఇస్తారు.

Similar News

News February 4, 2025

ఎమ్మెల్సీ కిడ్నాప్ కాలేదు: తిరుపతి ఎస్పీ

image

తిరుపతి ఎమ్మెల్సీ కిడ్నాప్ అయ్యారని జరుగుతున్న ప్రచారంపై జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పందించారు. ‘ఎమ్మెల్సీని ఎవరూ కిడ్నాప్ చేయలేదు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు ఆయనే వీడియో విడుదల చేశారు. తిరుపతిలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోనే ఉంది. 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్‌తో పాటు బందోబస్త్ పెంచాం. బాలాజీ కాలనీ నుంచి ఎస్వీయూ వరకు వాహనాలు మళ్లించాం’ అని ఎస్పీ స్పష్టం చేశారు.

News February 4, 2025

BREAKING: భారీగా పెరిగిన బంగారం ధరలు

image

పెళ్లిళ్ల సీజన్ వేళ పసిడి ధరలు భయపెడుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,050 పెరిగి రూ.78,100లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,150 పెరగడంతో రూ.85,200 పలుకుతోంది. ఇక కేజీ సిల్వర్ రేటు రూ.1,000 తగ్గి రూ.1,06,000లకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

News February 4, 2025

ఐటీ విచారణకు దిల్ రాజు

image

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఐటీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇటీవల ఆయన కార్యాలయంతో పాటు నివాసాల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో వ్యాపారాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు.

error: Content is protected !!