News December 14, 2024
రైతు రుణాలు.. గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ

రైతు రుణాలపై ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఎలాంటి తనఖా లేకుండా ఇచ్చే <<14805545>>లోన్ లిమిట్ రూ.2 లక్షలకు<<>> పెంచగా జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి ఇది సహాయపడనుందని కేంద్రం పేర్కొంది.
Similar News
News January 25, 2026
16 రోజుల డిజిటల్ అరెస్ట్.. రూ.14 కోట్లు స్వాహా

డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ NRI దంపతుల నుంచి ఏకంగా రూ.14.84 కోట్లను సైబర్ నేరగాళ్లు కాజేశారు. తాము CBI, పోలీసులమని చెప్పి నకిలీ అరెస్ట్ వారెంట్ చూపించి ఢిల్లీలో నివసిస్తున్న 77 ఏళ్ల మహిళ, ఆమె భర్తను 16 రోజుల పాటు వీడియో కాల్లో నిరంతరం నిఘా పెట్టారు. భయంతో బాధితులు తమ పెట్టుబడుల నుంచి డబ్బును వారికి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ కేసులో GJ, UP, ఒడిశా రాష్ట్రాల్లో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
News January 25, 2026
ఆర్సీబీ వరుస విజయాలకు ఢిల్లీ బ్రేక్

WPL-2026లో ఆర్సీబీ వరుస విజయాలకు ఢిల్లీ బ్రేక్ వేసింది. ఇవాళ జరిగిన మ్యాచులో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. ఛేదనలో ఢిల్లీ ఓపెనర్లు విఫలమైనా లారా(42*), రోడ్రిగ్స్(24), కాప్(19*) రాణించడంతో విజయం సొంతమైంది. ఈ గెలుపుతో DC పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. తొలి స్థానంలో ఆర్సీబీ(10P) ఉంది.
News January 24, 2026
స్కాట్లాండ్కు గోల్డెన్ ఛాన్స్

T20 వరల్డ్కప్లో స్కాట్లాండ్కు అదృష్టం కలిసి వచ్చింది. భద్రతా కారణాల సాకుతో భారత్కు రావడానికి బంగ్లాదేశ్ నిరాకరించడంతో ICC ఆ జట్టును తప్పించింది. దీంతో అత్యధిక ర్యాంకింగ్ ఉన్న <<18945385>>స్కాట్లాండ్<<>>కు అవకాశం దక్కింది. గ్రూప్ సీలో ఇంగ్లండ్, వెస్టిండీస్, నేపాల్, ఇటలీతో తలపడనుంది. దీంతో స్కాట్లాండ్ మంచి ప్రదర్శన కనబరిస్తే టాప్-8కు చేరే ఛాన్స్ ఉంది. ఇది ఆ దేశానికి వరుసగా ఐదో T20 WC కావడం విశేషం.


