News April 25, 2024

కోటక్ మహీంద్రా బ్యాంక్‌‌కు షాకిచ్చిన ఆర్బీఐ

image

మొబైల్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని కోటక్ మహీంద్రా బ్యాంక్‌‌ను ఆర్బీఐ ఆదేశించింది. అలాగే కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయొద్దని పేర్కొంది. డేటా సెక్యూరిటీకి సంబంధించి సమస్యలను సమగ్రంగా, సకాలంలో పరిష్కరించకపోవడంతో 35A సెక్షన్, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 ప్రకారం చర్యలు తీసుకుంది.

Similar News

News October 18, 2025

నేడు ఉద్యోగ సంఘాలతో చర్చలు

image

AP: నేడు సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో కీలక చర్చలు జరగనున్నాయి. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో మంత్రుల బృందం వారితో సమావేశంకానుంది. పీఆర్సీ అమలు, డీఏ బకాయిలు, జీపీఎఫ్, పీఎఫ్ సమస్యలు, పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంబంధిత సమస్యలపై చర్చించనున్నారు. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, సీఎస్ విజయానంద్ ఈ భేటీలో పాల్గొంటారు.

News October 18, 2025

భారత్‌కు ఆర్థిక నేరగాడు మెహుల్ ఛోక్సీ!

image

ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీని భారత్‌కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత్ అభ్యర్థన మేరకు అతడిని అరెస్టు చేయడం సరైందేనని అట్వర్ప్‌లోని న్యాయస్థానం పేర్కొంది. అయితే అతడికి హైకోర్టుకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉన్నా అతడిని ఇండియాకి తీసుకురావడంలో ఇది కీలక అడుగుగా చెప్పొచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.13 వేల కోట్లు ఎగవేసి ఛోక్సీ విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే.

News October 18, 2025

వేదాల ప్రధాన లక్ష్యం ఇదే..

image

మానవాళిని 3 రకాల కష్టాల నుంచి విముక్తి కలిగించడమే వేదాల ప్రధాన లక్ష్యం. ఈ కష్టాలనే త్రిబాధలని అంటారు. అందులో మొదటిది మన శరీరానికీ, మనసుకీ వచ్చే సమస్యలు. రెండోది ఇతరులు, జంతువుల వల్ల కలిగే బాధలు. చివరిది ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చే కష్టాలు. ఈ మూడు బాధలు తొలగి, ప్రతి ఒక్కరూ జీవితంలో నిజమైన శాంతిని, సుఖాన్ని పొందాలని వేదం కోరుకుంటుంది. ఇందుకోసం భగవంతుడిని ప్రార్థించమని ఉద్బోధిస్తుంది. <<-se>>#VedikiVibes<<>>