News February 7, 2025
నేడు వడ్డీ రేట్లు ప్రకటించనున్న ఆర్బీఐ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738902046170_1045-normal-WIFI.webp)
ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాల్ని కాసేపట్లో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించనున్నారు. కీలక రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెషన్ ఆరంభ సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 87.80 పాయింట్లు పెరిగి 78,145.96 వద్ద ఉంది. నిఫ్టీ 35.05 పాయింట్లు లాభపడి 23,638 వద్ద ట్రేడయింది.
Similar News
News February 7, 2025
శ్రేయస్ అయ్యర్ ఆటతో భారత్ గెలిచింది: జహీర్ ఖాన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738912695687_1045-normal-WIFI.webp)
ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన వన్డే మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్‌ను మాజీ పేసర్ జహీర్ ఖాన్ కొనియాడారు. ‘శ్రేయస్ ఆట చాలా చూడముచ్చటగా అనిపించింది. రెండు వికెట్లు కోల్పోయిన దశలో అయ్యర్ బ్యాటింగ్‌కు వచ్చారు. మరో వికెట్ పడి ఉంటే ఛేజింగ్ ఇబ్బంది అయ్యేదే. ఇన్నింగ్స్ చివరికి వచ్చేసరికి బంతి ఎలా గింగిరాలు తిరిగిందో చూశాం. కానీ తన దూకుడైన ఆటతో అయ్యర్ ఛేదనను సులువు చేసేశారు’ అని ప్రశంసించారు.
News February 7, 2025
ఢిల్లీ దంగల్: AAP, BJP పోటాపోటీ మీటింగ్స్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738913321877_1199-normal-WIFI.webp)
ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందు ఢిల్లీలో రాజకీయ వాతావరణం సీరియస్‌గా మారింది. నువ్వానేనా అన్నట్టుగా పోటీపడిన రెండు ప్రధాన పార్టీలు వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. BJP ఎరవేస్తోందంటూ ఆరోపించిన ఆప్ 70 మంది అభ్యర్థులను పార్టీ ఆఫీస్‌కు పిలిపించింది. మరోవైపు ఎంపీలు, పార్టీ కోఆర్డినేటర్లతో BJP కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఫలితాలు, ఆ తర్వాతి పరిణామాలపై రెండు పార్టీలూ చర్చిస్తున్నట్టు తెలిసింది.
News February 7, 2025
AI సమ్మిట్: వచ్చేవారం ఫ్రాన్స్‌కు మోదీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738912175379_1199-normal-WIFI.webp)
ప్రధాని నరేంద్రమోదీ వచ్చేవారం ఫ్రాన్స్‌లో పర్యటిస్తారు. FEB 11న పారిస్‌లో జరిగే AI సమ్మిట్‌కు ఆ దేశ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో కలిసి కో ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని తెలిసింది. దీనికి US VP JD వాన్స్, చైనా DyPM లీ కియాంగ్ హాజరవుతారు. 12న ఎయిరోస్పేస్, ఇంజిన్స్, సబ్‌మెరైన్ సహా ఇతర రంగాల్లో ఒప్పందాల పురోగతిపై మేక్రాన్, మోదీ చర్చిస్తారు. ఫ్రెంచ్ కంపెనీల అధిపతులు, దౌత్యవేత్తలతో సమావేశమవుతారు.