News March 18, 2024
బ్యాంకులకు RBI హెచ్చరిక!
సైబర్ దాడుల ముప్పు పొంచి ఉందని పలు బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ హెచ్చరించినట్లు సమాచారం. దీనిపై బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. సైబర్ సెక్యూరిటీ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎగ్జామినేషన్ (CSITE) సమీక్ష నిర్వహించిన అనంతరం RBI ఈ సూచనలు చేసింది. సైబర్ ముప్పును ఎదుర్కొనేందుకు బ్యాంకింగ్ రంగం సిద్ధంగా ఉండాలని RBI డిప్యూటీ గవర్నర్ రవి శంకర్ సైతం ఇటీవల పేర్కొనడం గమనార్హం.
Similar News
News January 5, 2025
పింక్ జెర్సీలో టీమ్ ఇండియా
క్యాన్సర్ పేషెంట్లకు సంఘీభావంగా సిడ్నీ టెస్టులో భారత ఆటగాళ్లు పింక్ కలర్ డ్రెస్లో బరిలోకి దిగారు. ఈ మ్యాచ్ తొలిరోజు నుంచే ఆసీస్ ఆటగాళ్లు పింక్ జెర్సీ ధరించి ఆడుతున్నారు. అయితే నిన్నటివరకు బ్లూకలర్ జెర్సీతో ఆడిన భారత ఆటగాళ్లు ఇవాళ పింక్ జెర్సీ ధరించారు. ప్రేక్షకులు కూడా దాదాపు అందరూ ఆ కలర్ దుస్తులే ధరించి రావడంతో స్టేడియమంతా పింక్మయమైంది. అటు మూడోరోజు కాసేపటికే జడేజా, సుందర్ ఔట్ అయ్యారు.
News January 5, 2025
పడిపోతున్న టెంపరేచర్.. వణికిస్తున్న చలి
తెలంగాణలో చలి వణికిస్తోంది. 15 జిల్లాల్లో 10 డిగ్రీలలోపే టెంపరేచర్ నమోదవుతోంది. నిన్న అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్లో 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గడిచిన తొమ్మిదేళ్లలో ఇక్కడ ఇదే కనిష్ఠ ఉష్ణోగ్రత కావడం గమనార్హం. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 6.1, ఆదిలాబాద్ జిల్లా అర్లిలో 6.2, కామారెడ్డి జిల్లా డోంగ్లి, రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 6.8 చొప్పున టెంపరేచర్ నమోదైంది.
News January 5, 2025
విద్యార్థుల కోసం ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులు
TG: విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 500 ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులు ఏర్పాటు చేయనుంది. తొలి దశలో ఒక్కో నియోజకవర్గంలో ఒక పార్కును ప్రయోగాత్మకంగా నిర్మించనుంది. అందుకు కంపెనీలు వెచ్చించే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ను ఉపయోగించనుంది.