News August 14, 2025
RBI కీలక నిర్ణయం.. గంటల్లోనే చెక్కుల క్లియరెన్స్

బ్యాంకుల్లో చెక్కుల క్లియరెన్స్‌పై RBI కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ ప్రక్రియకు 2 రోజుల సమయం పడుతుండగా తాజా నిర్ణయంతో కొన్ని గంటల్లోనే క్లియరెన్స్ రానుంది. ఈ విధానం అక్టోబర్ 4 నుంచి తొలి దశలో, వచ్చే ఏడాది జనవరి 3 నుంచి రెండో దశలో అమల్లోకి వస్తుంది. ఇందుకోసం ట్రంకేషన్ సిస్టమ్‌లో RBI మార్పులు చేయనుంది. దీంతో బ్యాంకు పని వేళల్లోనే చెక్కును స్కాన్ చేసి కొన్ని గంటల్లోనే పాస్ చేయనున్నాయి.
Similar News
News August 14, 2025
సెప్టెంబర్ 17 లేదా 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు: అయ్యన్నపాత్రుడు

AP: సెప్టెంబర్ 17 లేదా 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. YCP వాళ్లు వస్తారో? లేదో? క్లారిటీ ఇవ్వాలని సూచించారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న జగన్ అసెంబ్లీకి ఎందుకు రారని ప్రశ్నించారు. ‘అసెంబ్లీకి జగన్ ఇచ్చే గౌరవం ఇదేనా? సభకు వచ్చి సమస్యలు అడగాల్సిన బాధ్యత లేదా? YCP ప్రభుత్వంలో ఐదేళ్లలో 78 రోజులే సభను నడిపించారు’ అని విమర్శించారు.
News August 14, 2025
వార్-2 VS కూలీ.. ఏ మూవీకి వెళ్లారు?

NTR, హృతిక్‌ల ‘వార్-2’, రజినీకాంత్ ‘కూలీ’ సినిమాల బాక్సాఫీస్ ఫైట్ మొదలైంది. భారీ అంచనాల మధ్య ఇవాళ థియేటర్లలో విడుదలైన ఈ రెండు యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్నాయి. కానీ ఫ్యాన్స్‌కు మాత్రం అదిరిపోయే ఎక్స్‌పీరియన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమ అభిమాన హీరోల స్క్రీన్ ప్రజెన్స్‌తో కడుపునిండిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఏ మూవీకి వెళ్లారు? ఎలా అనిపించింది? COMMENT
News August 14, 2025
యువతిపై గ్యాంగ్‌రేప్.. 10 మంది అరెస్ట్

TG: స్నేహం, ప్రేమ అంటూ యువతి(18)ని నమ్మించి ఆమెపై 10 మంది అత్యాచారానికి పాల్పడిన ఘటన జనగామలో సంచలనం సృష్టించింది. తొలుత ఓ యువకుడు ప్రేమ పేరుతో దగ్గరై అఘాయిత్యానికి పాల్పడగా, జూన్‌లో అతడి స్నేహితులూ ఆమెకు దగ్గరయ్యారు. మాట్లాడుకుందామని పిలిచి కారులో ఓ రూమ్‌కు తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు ఆమెను శారీరకంగా వాడుకున్నారు. తన చిన్నమ్మ సాయంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులు అరెస్టయ్యారు.