News December 23, 2025

RC పురం: ‘సౌత్ ఇండియా సైన్స్‌ ఫెయిర్‌ ఏర్పాట్లు పక్కాగా ఉండాలి’

image

రామచంద్రాపురం మండలం కొల్లూరులోని గాడియం పాఠశాలలో వచ్చే జనవరి 19 నుంచి 23 వరకు నిర్వహించనున్న ‘దక్షిణ భారత సైన్స్‌ ఫెయిర్’ ఏర్పాట్లను ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేష్ పరిశీలించారు. ప్రాంగణంలోని వసతులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సైన్స్‌ ఫెయిర్‌కు వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఎక్కడా లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.

Similar News

News December 26, 2025

అన్నవరంలో ఆగని అపచారాలు!

image

అన్నవరం సత్యదేవుని ఆలయ సిబ్బంది వ్యవహారశైలిపై భక్తులు మండిపడుతున్నారు. కేశఖండశాలలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ క్షురకుడిని ఈవో త్రినాథరావు సస్పెండ్ చేశారు. గురువారం రాత్రి వసతి గదుల కోసం సీఆర్వో కార్యాలయానికి వెళ్లిన వారి పట్ల ఓ ఉద్యోగి దురుసుగా ప్రవర్తించినట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు మారినా సిబ్బంది తీరు మారడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News December 26, 2025

సంక్రాంతికి రైతుభరోసా..!

image

TG: యాసంగి సీజన్ రైతు భరోసా డబ్బులను (ఏడాదికి ఎకరానికి రూ.12,000) సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. శాటిలైట్ ఇమేజెస్ ద్వారా రైతులు, పంట డేటా సిద్ధం చేస్తోంది. జనవరి రెండో వారం నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయనుంది. పంటలు సాగు చేయని భూములను రైతు భరోసా నుంచి మినహాయించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

News December 26, 2025

ప.గో: ఆడుకోమని వదిలిన తండ్రి.. విగత జీవిగా కొడుకు!

image

పార్కులో తన కొడుకుని ఆడుకోమని వదిలి వెళ్లిన కొద్దిసేపటికి చెరువులో పడి విగత జీవిగా మారిన ఘటన గురువారం పెనుగొండలో చోటుచేసుకుంది. ఇరగవరం మండలం ఆర్.కండ్రిక గ్రామానికి చెందిన జొన్నల ధనరాజు పెనుగొండలో బేకరీ నిర్వహిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం కుమారుడు ఈశ్వర్(5) తీసుకొని బేకరీకి వచ్చిన ధనరాజు కొద్దిసేపు పార్కులో ఆడుకోమని వదిలిపెట్టి వెళ్లాడు. బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు.