News November 20, 2024
ఎల్లుండి నుంచి RC16 మూవీ షూటింగ్?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కించనున్న RC16 సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈనెల 22న మైసూర్లో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుందని సినీవర్గాలు పేర్కొన్నాయి. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా, ఇటీవల జాన్వీకపూర్ నటించిన ‘దేవర’ రిలీజై భారీ విజయాన్ని అందుకుంది. మరోవైపు రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కూడా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానున్న విషయం తెలిసిందే.
Similar News
News November 20, 2024
మహారాష్ట్రలో గెలిచేదెవరు? సట్టాబజార్ అంచనా ఇదే
పోలింగ్ ముగింపు సమయం సమీపించే కొద్దీ మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్పై ఆసక్తి పెరుగుతోంది. ఆరు పార్టీలు 2 కూటములుగా పోటీచేస్తున్నాయి. 288 సీట్లకు గాను మహాయుతి 144-152 గెలిచి మళ్లీ అధికారం చేపట్టొచ్చని రాజస్థాన్ ఫలోడి సట్టాబజార్ అంచనా వేసింది. రెండు కూటముల మధ్య ఓటింగ్ అంతరం తక్కువే ఉంటుందని, స్వింగ్ కాస్త అటు ఇటైనా ఫలితాలు మారొచ్చంది. హరియాణాలో కాంగ్రెస్ గెలుస్తుందన్న సట్టాబజార్ అంచనా తప్పడం గమనార్హం.
News November 20, 2024
Key to the City of Georgetown అసలు కథ ఇదే
గయానాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ రాజధాని జార్జ్టౌన్ Key to the City అందుకున్నారు. ఇది ఆ దేశ పాలకుల ద్వారా అతిథికి గౌరవసూచకంగా అందించే మధ్యయుగ కాలం నాటి సంప్రదాయం. ఆ దేశ పర్యటనకు విచ్చేసిన ప్రముఖ వ్యక్తుల పట్ల విశ్వాసం, గౌరవం, స్నేహపూర్వకతకు ప్రతీకగా దీన్ని బహూకరిస్తారు. మోదీపై గౌరవసూచకంగా, ఇరు దేశాల బంధాలు మరింత మెరుగుపడేలా ఆ దేశ పాలకులు ఈ తాళాన్ని బహూకరించారు.
News November 20, 2024
UNSC 1945లో ఉండిపోయింది: భారత్
ఐక్యరాజ్యసమితి భద్రతామండలి(UNSC) మారుతున్న కాలంతో పాటు ముందుకెళ్లడం మరచిపోయిందని భారత్ విమర్శించింది. ప్రగతి విషయంలో అత్యంత నెమ్మదిగా వ్యవహరిస్తోందని పేర్కొంది. ‘UNSC ప్రస్తుత పనితీరు 1945 నాటిదే. నేటి వాస్తవికతకు ఏమాత్రం దగ్గరగా లేదు. సహాయంలో UN అద్భుతమే. కానీ ఉద్రిక్తతల్ని కంట్రోల్ చేయడంలో మాత్రం విఫలమవుతోంది. సంస్థలో సంస్కరణలు అత్యవసరం’ అని UNలో భారత రాయబారి పర్వతనేని హరీశ్ వ్యాఖ్యానించారు.