News February 24, 2025

RC16 షూటింగ్ ఢిల్లీకి షిఫ్ట్?

image

బుచ్చిబాబు డైరెక్షన్‌లో రామ్ చరణ్-జాన్వీ జంటగా నటిస్తున్న RC16 మూవీ షెడ్యూల్ HYDలో పూర్తయినట్లు తెలుస్తోంది. చెర్రీ-దివ్యేందులపై క్రికెట్ సన్నివేశాలను తెరకెక్కించినట్లు సమాచారం. మార్చి ఫస్ట్ వీక్‌లో ఢిల్లీలో కుస్తీ నేపథ్య సీన్లను చిత్రీకరిస్తారని, కీలక నటీనటులంతా పాల్గొంటారని టాక్. ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్ పరిశీలనలో ఉండగా MAR 27న చరణ్ బర్త్ డే సందర్భంగా టీజర్ విడుదలయ్యే అవకాశం ఉంది.

Similar News

News February 24, 2025

తండ్రి చనిపోయిన దు:ఖంలోనూ రచయితకు ప్రభాస్ సాయం!

image

హీరో ప్రభాస్‌పై ‘బిల్లా’ రచయిత తోట ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘నేను 2010 FEBలో ఆస్పత్రిపాలయ్యా. అదేరోజు ప్రభాస్ గారి తండ్రి సూర్య నారాయణ రాజు గారు చనిపోయారు. దుఖంలో ఉన్నప్పటికీ ఆయన నా వైద్యం కోసం డబ్బులు పంపించి హెల్ప్ చేశారు. నాపట్ల అంత కేర్ తీసుకున్నారాయన. తండ్రిని కోల్పోయినప్పటికీ నా సినిమా రైటర్ అని నా గురించి ఆలోచించారు’ అని తనకు ప్రభాస్ చేసిన సాయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

News February 24, 2025

వంశీపై పీటీ వారెంట్

image

AP: గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో జైలులో ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీపై పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. రేపటితో రిమాండ్ ముగియనుండటంతో సీఐడీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఆయనపై మరిన్ని పాత కేసులను ఓపెన్ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కస్టడీలో ఉన్న వ్యక్తిపై మరో కేసు నమోదు చేస్తే కోర్టులో ప్రవేశపెట్టడానికి ముందు పీటీ వారెంట్ జారీ చేస్తారు.

News February 24, 2025

కోహ్లీ సెంచరీ.. అనుష్క శర్మ ❤️ పోస్ట్ వైరల్

image

పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ చేసి జట్టును గెలిపించడమే కాకుండా తిరిగి ఫామ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ను టీవీలో చూసిన అనుష్క శర్మ భర్త కోహ్లీని ఫొటో తీసి హైఫై, లవ్ సింబల్‌తో ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టి సంతోషం వ్యక్తం చేశారు. అంతకుముందు మ్యాచ్‌ను గెలిపించాక విరాట్ మెడలోని చైన్‌కు ఉన్న వెడ్డింగ్ రింగ్‌కు ముద్దుపెట్టారు. దీనికి రిప్లైగా అనుష్క పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

error: Content is protected !!