News March 19, 2024

రేపు RC16 షూటింగ్ స్టార్ట్

image

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబోలోని సినిమా షూటింగ్‌కు ముహూర్తం ఖరారైంది. వర్కింగ్ టైటిల్ RC16తో తెరకెక్కనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమం రేపు ఉదయం 10.10 గంటలకు జరగనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో చెర్రీకి జంటగా జాన్వీకపూర్ నటించనున్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరోవైపు రామ్‌చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్‌‌’లో నటిస్తున్నారు.

Similar News

News January 7, 2025

ఈ కోడి గుడ్డు ధర రూ.700

image

AP: సాధారణంగా బ్రాయిలర్ కోడి గుడ్డు ధర రూ.6-8, నాటు కోడి గుడ్డు అయితే రూ.10-13 పలుకుతుంది. అయితే పందెం కోడి గుడ్డుకు రూ.400-700 వరకు డిమాండ్ ఉంటోంది. తూర్పు కోడి, ఎర్ర కక్కెర, తెల్ల కోడి గుడ్డు రూ.400 వరకు, తెల్ల కెక్కర, ఎర్రమైల, అబ్రాసు మైల జాతుల గుడ్డు రూ.700 వరకు పలుకుతోంది. ఈ గుడ్లను ప్రత్యేక నాటుకోళ్లతో పొదిగిస్తారు. కొత్తపట్నం, సింగరాయకొండ మండలాల్లో చాలా మందికి ఇదొక కుటీర పరిశ్రమగా మారింది.

News January 7, 2025

కాంగ్రెస్ మోసంపై నిరసనలు ఢిల్లీకి చేరాయి: కేటీఆర్

image

TG: కాంగ్రెస్ అంటేనే కన్నింగ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం యూ టర్న్ తీసుకోవడంపై ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసు వద్ద పోస్టర్లు వెలిశాయని తెలిపారు. ‘రైతు డిక్లరేషన్’ ఎలా అమలవుతుందో రాష్ట్రానికి వచ్చి వివరించవచ్చు కదా అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. ‘అబద్ధాల కాంగ్రెస్‌లో అన్ని అరకొర గ్యారంటీలు, అర్ధ సత్యాలే’ అని ట్వీట్ చేశారు.

News January 7, 2025

వెండి నగలకూ హాల్ మార్కింగ్!

image

బంగారం ఆభరణాల మాదిరే వెండి నగలకూ హాల్‌మార్క్ తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ ప్రతిపాదనను పరిశీలించాలని BISను కోరినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. అమలు సాధ్యాసాధ్యాలు, వినియోగదారులు, డీలర్ల స్పందనలను తెలుసుకోవాలని కోరినట్లు చెప్పారు. అవసరమైన చర్చల తర్వాతే ప్రక్రియ మొదలుపెడతామన్నారు. అటు 3-6 నెలల్లో ఈ విధానం అమలుకు సిద్ధంగా ఉన్నట్లు BIS డైరెక్టర్ ప్రమోద్ కుమార్ చెప్పారు.