News March 30, 2024
అరుదైన రికార్డును సాధించిన RCB

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో KKRతో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ అరుదైన రికార్డును సాధించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో 1500 సిక్సులు బాదిన రెండో టీమ్గా RCB నిలిచింది. ఇప్పటివరకు కేవలం ముంబై ఇండియన్స్ జట్టు మాత్రమే ఈ జాబితాలో ఉంది. ఈ మ్యాచ్లో కోహ్లీతో పాటు గ్రీన్ చెరో రెండు సిక్సులు బాదారు. మరి ఈ మ్యాచ్లో ఎన్ని సిక్సులు నమోదవుతాయో కామెంట్ చేయండి.
Similar News
News January 29, 2026
అమరావతిలో న్యూఇండియా అష్యూరెన్స్ కంపెనీ

AP: రాజధాని అమరావతిలో ది న్యూఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్(NIACL) రీజినల్ ఆఫీస్ ఏర్పాటు చేయనుంది. ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి పరిధిలో రూ.100కోట్లతో ఆఫీస్ నిర్మాణం చేపట్టనుంది. ఈ మేరకు నిన్న CRDA అధికారులతో ఆ కంపెనీ చీఫ్ రీజినల్ మేనేజర్ వి.రాజా ఒప్పందం చేసుకున్నారు. టెక్నికల్, ఫైనాన్స్, మార్కెటింగ్ తదితర విభాగాల్లో 200-225 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
News January 29, 2026
మేడారం జాతరలో మహిళ ప్రసవం

TG: మేడారం వనదేవతల సన్నిధిలో ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. HYD మౌలాలీకి చెందిన నిండు గర్భిణి రజిత జాతరకు వెళ్లారు. ఇవాళ తెల్లవారుజామున ఆమెకు పురిటి నొప్పులు మొదలవడంతో మేడారంలోని ప్రధాన ఆస్పత్రికి తరలించారు. DMHO డా.అప్పయ్య పర్యవేక్షణలో వరంగల్ CKM ఆస్పత్రి వైద్యులు రమ్య, నికిత ఆమెకు సుఖప్రసవం చేశారు. రజిత మగబిడ్డకు జన్మనివ్వగా, తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు.
News January 29, 2026
OTTలోకి వచ్చేసిన ఛాంపియన్ మూవీ

రోషన్ హీరోగా అనస్వర, అవంతిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఛాంపియన్’ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. గతనెల 25న విడుదలైన ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను స్పప్న దత్ నిర్మాణంలో ప్రదీప్ అద్వైతం తెరకెక్కించారు. సోషల్ మీడియా సెన్సేషన్గా మారిన ‘గిర గిర గింగిరాగిరే’ సాంగ్ ఈ మూవీలోనిదే.


