News March 22, 2024
RCB, CSK జట్లు ఇవే

CSKతో మ్యాచ్‌లో RCB టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకుంది.
RCB: డుప్లెసిస్ (C), కోహ్లీ, రజత్ పాటిదార్, మ్యాక్స్‌వెల్, గ్రీన్, దినేశ్ కార్తీక్, అనుజ్ రావత్ (WK), కరన్ శర్మ, అల్జరీ జోసెఫ్, మయాంక్ దగర్, సిరాజ్
CSK: గైక్వాడ్ (C), రచిన్, రహానె, మిచెల్, జడేజా, సమీర్ రిజ్వీ, ధోనీ (WK), దీపక్ చాహర్, ముస్తాఫిజుర్, తీక్షణ, తుషార్ దేశ్‌పాండే
Similar News
News July 9, 2025
యాపిల్ COOగా భారత సంతతి వ్యక్తి

భారత సంతతికి చెందిన సాబి ఖాన్‌ను కొత్త చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(COO)గా జెఫ్ విలియమ్స్ స్థానంలో యాపిల్ కంపెనీ నియమించింది. ఈ నెలాఖరులో ఖాన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. 1995లో యాపిల్‌లో చేరిన ఖాన్ 30 ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్నారు. ఆయన ప్రస్తుతం ఆపరేషన్స్ విభాగంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అధునాతన తయారీ విధానాలు, ఆవిష్కరణల్లో ఖాన్ పనితీరును యాపిల్ సీఈవో టిమ్ కుక్ ప్రశంసించారు.
News July 9, 2025
నేడు చిత్తూరు జిల్లాలో జగన్ పర్యటన

AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో మామిడి రైతులను పరామర్శించనున్నారు. రైతులతో సమావేశమై, వారి కష్టాలను స్వయంగా తెలుసుకోనున్నారు. ప్రస్తుతం పులివెందులలో ఉన్న జగన్ హెలికాఫ్టర్‌లో ఉ.11 గం.కు కొత్తపల్లికి రానున్నారు. హెలిప్యాడ్ వద్ద 30 మంది, మార్కెట్ యార్డులో జగన్‌తో పాటు 500 మంది మాత్రమే ఉండాలని పోలీసులు ఆంక్షలు విధించారు.
News July 9, 2025
భారత్ రఫేల్ జెట్ కూలిపోయింది.. కానీ..: దసో ఏవియేషన్ సీఈవో

‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ ఒక రఫేల్ ఫైటర్ జెట్‌ను కోల్పోయిందని ఆ జెట్‌ల తయారీ సంస్థ ‘దసో ఏవియేషన్’ సీఈవో ఎరిక్ ట్రాపియర్ వెల్లడించారు. అయితే శత్రువుల (పాకిస్థాన్) దాడి వల్ల అది నేలకూలలేదని, టెక్నికల్ ఫెయిల్యూర్ వల్లే కూలిపోయిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా రఫేల్ కూలిపోయినట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించలేదు. అటు 6 రఫేల్ విమానాలను కూల్చేసినట్లు పాకిస్థాన్ ప్రచారం చేస్తోంది.