News April 8, 2025

RCB కెప్టెన్‌కు జరిమానా

image

IPL: MIతో నిన్న జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా RCB కెప్టెన్ రజత్ పాటీదార్‌కు బీసీసీఐ జరిమానా విధించింది. మొదటిసారి కావడంతో రూ.12 లక్షల ఫైన్ వేసింది. కాగా కెప్టెన్‌గా తొలి సీజన్‌లోనే రజత్ రాణిస్తున్నారు. నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించారు. మరోవైపు బ్యాటింగ్‌లోనూ అదరగొడుతున్నారు. అతడు జట్టును కూల్‌గా ముందుండి నడిపిస్తున్నారని తాజాగా గవాస్కర్ ప్రశంసించారు.

Similar News

News January 7, 2026

‘ప్రజల భద్రతే ముఖ్యం’.. వెనిజులా సంక్షోభంపై భారత్ ఆందోళన

image

వెనిజులా తాజా పరిస్థితులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రి జైశంకర్ లక్సెంబర్గ్‌లో మాట్లాడుతూ.. ‘వెనిజులా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అక్కడ శాంతి నెలకొనాలని, అన్ని పక్షాలు ప్రజల భద్రత, సంక్షేమానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నాం. వెనిజులాతో భారత్‌కు ఎప్పటి నుంచో మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుత సంక్షోభం నుంచి ఆ దేశ ప్రజలు సురక్షితంగా బయటపడాలన్నదే మా ఆకాంక్ష’ అని అన్నారు.

News January 7, 2026

ఛార్జీలు పెంచితే బస్సులు సీజ్: రవాణా శాఖ

image

AP: సంక్రాంతి రద్దీని ఆసరాగా చేసుకునే ప్రైవేట్ ఆపరేటర్లు ఛార్జీలు పెంచితే బస్సులు సీజ్ చేస్తామని ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ మనీశ్ కుమార్ హెచ్చరించారు. అధికారులు నిత్యం ధరలను మానిటర్ చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ఏపీకి తిరిగే బస్సులపై ప్రత్యేక దృష్టిసారించినట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల నుంచి కూడా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నట్లు చెప్పారు.

News January 7, 2026

డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకాలజికల్ రీసెర్చ్‌లో ఇంటర్న్‌షిప్

image

DRDOకు చెందిన డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకాలజికల్ రీసెర్చ్‌ 8 పెయిడ్ ఇంటర్న్‌షిప్‌ల కోసం దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 25 వరకు అప్లై చేసుకోవచ్చు. పీజీ(సైకాలజీ) ఫైనల్ ఇయర్, B.TECH/BE(CSE) ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు అర్హులు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు రూ.5వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in