News November 29, 2024
RCB కెప్టెన్ కోహ్లీనే: డివిలియర్స్

IPL2025లో RCB కెప్టెన్‌గా విరాట్ కోహ్లీనే వ్యవహరిస్తారని మాజీ క్రికెటర్ డివిలియర్స్ వెల్లడించారు. ఇది అధికారికం కాకపోయినా అతనే సారథ్య బాధ్యతలు తీసుకుంటారని స్పష్టం చేశారు. భువనేశ్వర్, హెజిల్వుడ్, ఎంగిడి లాంటి బౌలర్లను RCB తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. డుప్లెసిస్‌ను జట్టు వదులుకోవడం, కెప్టెన్సీ క్యాండిడేట్స్ లేకపోవడంతో కోహ్లీ తిరిగి బాధ్యతలు చేపట్టడం ఖాయమని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News November 26, 2025
విశాఖ రివ్యూ మీటింగ్‌లో MLA మద్దిపాటి

ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు బుధవారం విశాఖ కలెక్టరేట్లో జరిగిన అసెంబ్లీ అంచనాల కమిటీ సభ్యుని హోదాలో రివ్యూ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ ఎస్టిమేట్‌కి సంబంధించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, విశాఖ కలెక్టర్‌తో పాటుగా ఇతర జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
News November 26, 2025
బెట్టింగ్‌లతో అప్పులు.. గన్ తాకట్టు పెట్టిన ఎస్ఐ!

TG: హైదరాబాద్ అంబర్పేట్ SI గన్ మిస్సింగ్ వ్యవహారం కలకలం రేపింది. ఓ కేసులో రికవరీ చేసిన బంగారంతోపాటు తన సర్వీస్ గన్ను SI భాను ప్రకాశ్ తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది. భారీగా అప్పులు చేశారని, బెట్టింగ్‌లో రూ.80 లక్షలు పోగొట్టుకున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే బంగారం, తుపాకీ తాకట్టు పెట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం భాను ప్రకాశ్‌ను టాస్క్‌ఫోర్స్ అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతోంది.
News November 26, 2025
BELOPలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

BEL ఆప్ట్రోనిక్ డివైసెస్ లిమిటెడ్(<


