News March 18, 2024
రాజస్థాన్ రాయల్స్‌పై ఆర్సీబీ ఫ్యాన్స్ ఆగ్రహం

ఆర్సీబీ మహిళల జట్టు WPL కప్పును గెలుచుకున్న సంగతి తెలిసిందే. అందుకు శుభాకాంక్షలు చెప్పే బదులు పురుషుల జట్టును ట్రోల్ చేసేలా రాజస్థాన్ రాయల్స్ ఓ ట్వీట్ చేసింది. పురుషులు చేయలేనిది మహిళలు చేశారన్న అర్థం వచ్చేలా ఆ పోస్టు ఉంది. దానిపై ఆర్సీబీ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేం తీరు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్లో చూసుకుందాం అంటూ సవాళ్లు విసురుతున్నారు.
Similar News
News October 25, 2025
నిరుద్యోగ బాకీ కార్డును ఆవిష్కరించిన హరీశ్ రావు

TG: ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగ JAC డిమాండ్ చేసింది. 2 లక్షల ఉద్యోగుల భర్తీ చేయాలంటూ నిరుద్యోగ బాకీ కార్డును బీఆర్ఎస్ నేత హరీశ్ రావు HYDలోని జలవిహార్‌లో ఆవిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసగించిందని ఆయన దుయ్యబట్టారు. రేవంత్ అన్ని విధాలుగా విఫలమయ్యారని ఫైరయ్యారు. మరోవైపు నిరుద్యోగులు BRS ట్రాప్‌లో పడొద్దని కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నారు.
News October 25, 2025
దాని బదులు చావును ఎంచుకుంటా: లాలూ కుమారుడు

RJD చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరిగి తండ్రి పార్టీలో చేరే బదులు చావును ఎంచుకుంటానని చెప్పారు. తనకు నైతిక విలువలు, ఆత్మగౌరవమే ముఖ్యమని తెలిపారు. పార్టీ లైన్ క్రాస్ చేయడంతో కొన్ని నెలల క్రితం ఆయనను ఆర్జేడీ బహిష్కరించింది. ఈ క్రమంలో జనశక్తి జనతాదళ్ పార్టీ స్థాపించిన ఆయన గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన మహువా అసెంబ్లీ స్థానం నుంచే బరిలోకి దిగుతున్నారు.
News October 25, 2025
ఆ యాప్‌లను అధిగమించలేము: పర్ప్లెక్సిటీ సీఈవో

యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్‌ను అధిగమించడం అసాధ్యమని ఏఐ సెర్చింజన్ పర్ప్లెక్సిటీ CEO అరవింద్ శ్రీనివాస్ అన్నారు. గూగుల్ రూపొందించిన ఇతర యాప్‌లను మాత్రం స్టార్టప్ సంస్థలు అధిగమించవచ్చని అభిప్రాయపడ్డారు. గూగుల్ ఎకో సిస్టమ్‌ను ఏ స్టార్టప్ దాటలేదని ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు ఆయనపై విధంగా బదులిచ్చారు. గూగుల్ సృష్టించిన జెమినీని అధిగమించడం కష్టమేనని పలువురు పేర్కొన్నారు. అరవింద్ కామెంట్స్‌పై మీరేమంటారు?


