News April 11, 2025
విరాట్పై ఆర్సీబీ ఫ్యాన్స్ విమర్శలు

నిన్న రాత్రి DCతో మ్యాచ్లో RCBకి సాల్ట్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. డీసీ బౌలర్ స్టార్క్ వేసిన ఒక ఓవర్లోనే 30 రన్స్ వచ్చాయి. బెంగళూరు కచ్చితంగా 220 ప్లస్ స్కోర్ చేస్తుందని ఫ్యాన్స్ భావించగా 167 పరుగులకే పరిమితమైంది. దీంతో విరాట్ సాల్ట్ను రనౌట్ చేసి మంచి ఊపును దెబ్బతీశారంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరోవైపు విరాట్ తప్పులేదంటూ కొంతమంది కోహ్లీకి మద్దతుగా నిలుస్తున్నారు.
Similar News
News December 5, 2025
ADB: పల్లె నుంచి పార్లమెంటు వరకు..!

ఒక గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో సర్పంచ్ కీలక పదవి. అలా గ్రామంలో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన వారు కొందరు మంత్రులయ్యారు. ఆ కోవకు చెందినవారే పొద్దుటూరి నర్సారెడ్డి. సారంగాపూర్ మండలం మలక్ చించోలి గ్రామ సర్పంచిగా మొదలైన ఆయన ప్రస్థానం మూడుసార్లు ఎమ్మెల్యే, ఒక సారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇందులో ఓసారి ఏకగ్రీవ ఎమ్మెల్యేగా కావడం విశేషం. నర్సారెడ్డిని స్థానికులు నరసన్న బాపు అని ప్రేమగా పిలిచేవారు.
News December 5, 2025
జుట్టు చివర్లు చిట్లుతున్నాయా..?

వాతావరణ మార్పుల వల్ల వెంట్రుకల చివర్లు చిట్లడం ఎక్కువైపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే వారానికి రెండు సార్లు తలస్నానం చెయ్యాలి. తలస్నానానికి మైల్డ్ షాంపూలు వాడటం మంచిది. బయటకి వెళ్తున్నప్పుడు జుట్టంతా కప్పిఉంచుకోవాలి. తలస్నానం తర్వాత హెయిర్ సీరం వాడటం మంచిది. డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మెడికేటెడ్ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడకూడదు. అయినా సమస్య తగ్గకపోతే ఒకసారి ట్రైకాలజిస్ట్లను సంప్రదించాలి.
News December 5, 2025
గూగుల్ డేటా సెంటర్కు 480 ఎకరాలు

AP: విశాఖలో గూగుల్ సంస్థ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్కు 480 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. విశాఖ(D)లోని తర్లువాడ, అడవివరం, అనకాపల్లి(D)లోని రాంబిల్లిలో భూమిని ఇచ్చేందుకు అంగీకరించింది. గూగుల్ విజ్ఞప్తి మేరకు ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్న అదానీ ఇన్ఫ్రా పేరున కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దశల వారీగా వెయ్యి మెగా వాట్ల ఏఐ డేటా సెంటర్ను గూగుల్ ఏర్పాటు చేయనుంది.


