News November 24, 2024
జితేశ్ శర్మను దక్కించుకున్న ఆర్సీబీ

రూ.కోటి బేస్ ప్రైజ్‌తో ఆక్షన్‌లోకి వచ్చిన జితేశ్ శర్మను RCB దక్కించుకుంది. రూ.11 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్లో ఇతను పంజాబ్ తరపున వికెట్ కీపింగ్ చేశాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు వచ్చే జితేశ్ శర్మ భారీ హిట్లు కొట్టగలరు. లీగ్ కెరీర్లో 40 మ్యాచులు ఆడి 151.14 స్ట్రైక్ రేట్‌తో 730 రన్స్ చేశారు.
Similar News
News October 18, 2025
జైనుల దీపావళి ఎలా ఉంటుందంటే..?

జైనులు దీపావళిని ఆధ్యాత్మిక దినంగా పరిగణిస్తారు. ఈరోజునే మహావీరుడు నిర్యాణం పొందిన రోజుగా భావిస్తారు. ఆయన దివ్యజ్యోతికి ప్రతీకగా దీపాలను వెలిగిస్తారు. ఆ కాంతిని మహావీరునికి అంకితం చేస్తారు. ఆయన జ్ఞాన బోధనలను, చూపిన మోక్షమార్గాన్ని స్మరించుకుంటారు. దీపావళిని వారు అంత పవిత్రంగా భావిస్తారు కాబట్టే.. వ్యాపారాలను ఈ శుభదినం నుంచి ప్రారంభిస్తే సత్ఫలితాలు ఉంటాయని నమ్ముతారు. నూతన సంవత్సరంగా జరుపుకొంటారు.
News October 18, 2025
డిమాండ్లు తీరుస్తాం… వైద్యులు విధుల్లో చేరాలి: ప్రభుత్వం

AP: PHCల వైద్యులు వెంటనే విధుల్లో చేరాలని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్ సూచించారు. PG మెడికల్ ఇన్‌సర్వీస్ కోటాను ఈఏడాది అన్ని కోర్సుల్లో కలిపి 20% అమలుకు GO ఇస్తామని వారితో చర్చల్లో వెల్లడించారు. ట్రైబల్ అలవెన్సు తదితర డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే PGలో 15% కోటా 3ఏళ్లు ఇవ్వాలని సంఘం నేతలు కోరగా దీనిపై ప్రభుత్వం నవంబర్‌లో నిర్ణయం తీసుకుంటుందని గౌర్ చెప్పారు.
News October 18, 2025
మినుములో మారుకా పురుగు.. వేపనూనెతో చెక్

మినుము మొగ్గ, పిందె దశలలో మారుకా మచ్చల పురుగు ఆశించి నష్టం కలిగిస్తుంది. ఒక తల్లి పురుగు 200-500 గుడ్లను పెడుతుంది. వాటి లార్వాలు బయటకు వచ్చి మొగ్గలు, పిందెలను తినేస్తాయి. దీంతో దిగుబడి తగ్గిపోతుంది. ఈ పురుగు నివారణకు 5మి.లీ వేప నూనె లేదా నొవల్యూరాన్ 1.0మి.లీ లేదా క్లోరిపైరిఫాన్ 2.5 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 5-10 రోజుల వ్యవధిలో ఈ మందులను మార్చి పిచికారీ చేయాలి.