News April 29, 2024
చరిత్ర సృష్టించిన ఆర్సీబీ
గుజరాత్తో మ్యాచులో ఆర్సీబీ సంచలనం సృష్టించింది. 24 బంతులు మిగిలి ఉండగానే 200 పైచిలుకు పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన తొలి జట్టుగా నిలిచింది. నిన్న 201 పరుగుల లక్ష్యాన్ని RCB 16 ఓవర్లలోనే ఛేదించిన సంగతి తెలిసిందే. అంతకుముందు 2023లో ఆర్సీబీపై ముంబై 21 బంతులు మిగిలి ఉండగానే 200పైచిలుకు పరుగుల లక్ష్యాన్ని అందుకుంది.
Similar News
News January 3, 2025
అధికారులు సీరియస్గా అర్జీలు పరిష్కరించాలి: అనగాని
APలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో అర్జీల పరిష్కారంపై ప్రజలు సంతృప్తిగా లేరని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. మంగళగిరి CCLA ఆఫీసులో రెవెన్యూ శాఖపై ఆయన సమీక్షించారు. 2016లో అసెంబ్లీలో తాను ప్రస్తావించిన 22A సమస్యకే ఇంకా పరిష్కారం చూపలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై CM కూడా సీరియస్గా ఉన్నారని, ప్రజలు ఎంతమేరకు సంతృప్తిగా ఉన్నారనే విషయంపై అధికారులు ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సూచించారు.
News January 3, 2025
వైసీపీకి 11 సీట్లు.. అందుకే: చింతామోహన్
AP: మాజీ సీఎం జగన్పై కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్పై 11 కేసులున్నాయని, అందుకే వైసీపీకి 11 సీట్లు వచ్చాయని తెలిపారు. ఆయన మీద కేసులు ఎక్కువగా ఉంటే, ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేవేమో అని ఎద్దేవా చేశారు. YCPని ప్రజలు పట్టించుకోవడంలేదన్నారు. డబ్బుల కోసం కొందరు కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లారని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై సీఎం చంద్రబాబు స్పందించాలని ఆయన కోరారు.
News January 3, 2025
ఆ ఉద్యోగులకు మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్
TG: రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఫైరయ్యారు. ఈ మేరకు ప్రజల నుంచి ఫిర్యాదు అందుతున్నాయని తెలిపారు. అధికారులు అవినీతికి పాల్పడటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. తీరు మార్చుకోకపోతే ACBకి వివరాలు పంపిస్తానని, విజిలెన్స్ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సస్పెండైన వారిని మళ్లీ ఉద్యోగంలోకి రాకుండా చేస్తామన్నారు. అవినీతి సొమ్ము రికవరీ చేయిస్తానని చెప్పారు.