News October 31, 2024

హైదరాబాదీ పేసర్‌కు ఆర్సీబీ నో ఛాన్స్!

image

టీమ్‌ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌‌ను ఆర్సీబీ రిటైన్ చేసుకోలేదు. కెప్టెన్ డుప్లిసెస్‌, మ్యాక్స్‌వెల్, గ్రీన్‌లను సైతం వేలంలోకి వదిలేసింది. రూ.37 కోట్లు వెచ్చించి ముగ్గురిని రిటైన్ చేసుకుంది. కాగా ఐపీఎల్‌ 2024లో రూ.7కోట్లకు సిరాజ్‌ను RCB కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో 14 మ్యాచులు ఆడిన సిరాజ్ 15 వికెట్లు తీసి 496 పరుగులిచ్చారు. మరి మెగా వేలంలో ఈ హైదరాబాదీ పేసర్ ఎంత పలుకుతాడో కామెంట్ చేయండి.

Similar News

News November 16, 2024

తిరుమలలో రేపు కార్తీక వనభోజనం.. పటిష్ఠ ఏర్పాట్లు

image

AP: తిరుమలలో రేపు కార్తీక వన భోజన కార్యక్రమం సందర్భంగా పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. వర్ష సూచనల నేపథ్యంలో వన భోజనం నిర్వహణ వేదికను పార్వేట మండపం నుంచి వైభవోత్సవం మండపానికి మార్చినట్లు తెలిపింది. రేపు ఉ.11 గంటలకు గజ వాహనంపై ఊరేగింపుగా వైభవోత్సవ మండపానికి మలయప్పస్వామి రానున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు.

News November 16, 2024

ఆధార్ ఉన్నవారికి అలర్ట్

image

మీ ఆధార్ దుర్వినియోగమైందా? లేదా? తెలుసుకోవాలంటే..
* <>uidai.gov.in<<>> పోర్టల్‌లోకి మీ ఆధార్ నంబర్, క్యాప్చా, మొబైల్‌కి వచ్చే OTPతో లాగిన్ అవ్వాలి.
* తర్వాత అథెంటికేషన్ హిస్టరీపై క్లిక్ చేయండి.
* అక్కడ ‘ఆల్’ని సెలెక్ట్ చేసి ‘ఫెచ్ అథెంటికేషన్ హిస్టరీ’పై క్లిక్ చేస్తే మీ ఆధార్ ఎక్కడెక్కడ ఉపయోగించారనే వివరాలు తెలిసిపోతాయి. మీ ఆధార్‌ దుర్వినియోగమైనట్లు తెలిస్తే 1947కి కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.

News November 16, 2024

‘అమరన్’ థియేటర్‌పై పెట్రోల్ బాంబు దాడి

image

తమిళనాడులోని తిరునల్వేలిలో ‘అమరన్’ మూవీ ఆడుతున్న థియేటర్‌పై పెట్రోల్ బాంబు దాడి జరిగింది. ఇవాళ తెల్లవారుజామున ఇద్దరు వ్యక్తులు 3 పెట్రోల్ బాంబుల్ని హాల్‌పైకి విసరడం సీసీ కెమెరాల్లో నమోదైంది. స్థానికుల మధ్య ఉన్న తగాదాలే దీనికి కారణమని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. సినిమాలో కొన్ని సన్నివేశాలపై తమిళనాట కొన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు.