News February 24, 2025
చరిత్ర సృష్టించిన ఆర్సీబీ ప్లేయర్

WPLలో ఆర్సీబీ ప్లేయర్ ఎలీస్ పెర్రీ చరిత్ర సృష్టించారు. టోర్నీ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా ఆమె అవతరించారు. ఇప్పటివరకు పెర్రీ 835 పరుగులు సాధించారు. ఈ క్రమంలో మెగ్ లానింగ్(782) రికార్డును ఆమె తుడిచిపెట్టేశారు. యూపీతో జరుగుతున్న మ్యాచులో ఆమె ఈ ఫీట్ నెలకొల్పారు. కాగా ఐపీఎల్లోనూ అత్యధిక పరుగుల రికార్డు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (8,004) పేరిట ఉన్న విషయం తెలిసిందే.
Similar News
News February 25, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 25, 2025
శుభ ముహూర్తం (25-02-2025)

☛ తిథి: బహుళ ద్వాదశి, ఉ.10.32 వరకు
☛ నక్షత్రం: ఉత్తరాషాడ, సా.5.07 వరకు
☛ శుభ సమయం: సా.7.07-7.31 వరకు
☛ రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు
☛ యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
☛ దుర్ముహూర్తం: ఉ.8.24-9.12, రా.10.48-11.36 వరకు
☛ వర్జ్యం: రా.9.01 నుంచి 10.35 వరకు
☛ అమృత ఘడియలు: ఉ.10.37-12.13 వరకు, రా.8.22-9.54 వరకు
News February 25, 2025
నమాజ్ వేళలు.. ఫిబ్రవరి 25, మంగళవారం

ఫజర్: తెల్లవారుజామున 5.25 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.37 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.29 గంటలకు
అసర్: సాయంత్రం 4.44 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.21 గంటలకు
ఇష: రాత్రి 7.34 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.