News March 18, 2024
పల్టీలు కొట్టిన ఆర్సీబీ ప్లేయర్

ఆర్సీబీ 16 ఏళ్ల కలను నెరవేర్చిన మహిళా ప్లేయర్లు మైదానంలో సంతోషంతో కేరింతలు కొట్టారు. టైటిల్ గెలుపు ఆనందంలో ఆ టీమ్ ఓపెనర్ సోఫీ డివైన్ పల్టీలు కొడుతూ సందడి చేశారు. పలువురు ప్లేయర్లు సెల్ఫీలు తీసుకుంటూ స్టేడియంలోని అభిమానులకు అభివాదం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆర్సీబీ ట్వీట్ చేసింది. ఇక బెంగళూరులో ఆర్సీబీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ర్యాలీలు చేశారు. ‘ఈ సాలా కప్ నమదే’ నిజమైందంటూ నినాదాలు చేశారు.
Similar News
News November 6, 2025
‘అవిశ’ పశువులకు పోషకాలతో కూడిన మేత

అవిశ ఆకులు పశువులకు ముఖ్యంగా పాలిచ్చే వాటికి, మేకలకు అద్భుతమైన ఆహారమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అవిశ ఆకుల్లో 25-30 శాతం ప్రొటీన్లు ఉంటాయి. పశువులకు సులభంగా జీర్ణమయ్యే మేత ఇది. పశువులు అవిశ ఆకులను చాలా ఇష్టంగా తిని అధిక పాల దిగుబడినిస్తాయి. అవిశ పిండి(అవిశ గింజల నుంచి నూనె తీసిన తర్వాత మిగిలిన పదార్థం)ని కూడా పశువులకు మేతగా ఉపయోగించవచ్చు. దీనిలో ప్రొటీన్లు, పోషకాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి.
News November 6, 2025
TG SETకు దరఖాస్తు చేశారా?

అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్‌షిప్‌కు అర్హత సాధించే <
News November 6, 2025
పెరిగిన బంగారం, వెండి ధరలు

గత రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రూ.430 పెరిగి రూ.1,21,910కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి రూ.400 పెరిగి రూ.1,11,750 పలుకుతోంది. అటు కేజీ వెండి రేటు రూ.1,000 పెరిగి రూ.1,64,000గా ఉంది.


