News April 4, 2025
పిల్లలతో RCB ప్లేయర్ల సెల్ఫీలు.. వైరల్

టాలెంటెడ్ యంగ్ క్రికెటర్లతో RCB ప్లేయర్లు విరాట్ కోహ్లీ, కృనాల్ పాండ్య, పడిక్కల్ సెల్ఫీలు దిగారు. వారితో సరదాగా మాట్లాడి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. తమ ఆరాధ్య క్రికెటర్లతో ఫొటోలు దిగడంతో పిల్లలు సంతోషం వ్యక్తం చేశారు. పైన ఫొటోలు చూడొచ్చు.
Similar News
News April 11, 2025
కేఎల్ ఉంటే ఖేల్ ఖతమే

DC బ్యాటర్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు నెలకొల్పారు. ఐపీఎల్‌లో ఛేజింగ్ జట్టు గెలిచిన సందర్భాల్లో అత్యధిక యావరేజ్(71.05) కలిగిన ఇండియన్ బ్యాటర్‌గా నిలిచారు. ఈ జాబితాలో డేవిడ్ మిల్లర్(103.70 యావరేజ్) టాప్‌లో ఉన్నారు. KL 25 ఇన్నింగ్సుల్లో 148.58 స్ట్రైక్ రేటుతో 1,208 రన్స్ చేశారు. ఇందులో 12 హాఫ్ సెంచరీలున్నాయి. ఐపీఎల్‌లో సక్సెస్‌ఫుల్ రన్‌ఛేజ్ మ్యాచ్‌లలో మొత్తంగా 56 మంది 500+ పరుగులు చేశారు.
News April 11, 2025
నేటి నుంచి పాకిస్థాన్ సూపర్ లీగ్

పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL) 10వ సీజన్ నేడు ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టు లాహోర్ ఖలందర్స్‌తో రావల్పిండిలో తలపడనుంది. వచ్చే నెల 18 వరకు ఈ సీజన్ జరగనుంది. ఆరు జట్లు మొత్తం 34 మ్యాచులాడతాయి. కరాచీ కింగ్స్‌కు డేవిడ్ వార్నర్ ఆడనుండటం ఈసారి ప్రత్యేకతగా నిలవనుంది.
News April 11, 2025
బీజేపీలోకి విజయసాయి రెడ్డి?

AP: YSRCP, రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకొంటున్నానని ప్రకటించిన మాజీ MP విజయసాయి రెడ్డి BJP తీర్థం పుచ్చుకోనున్నారన్న ప్రచారం జోరుగా నడుస్తోంది. తొలుత టీడీపీ, జనసేన వైపు చూస్తున్నారన్న టాక్ వినిపించినా.. ఫైనల్‌గా బీజేపీయే బెటర్ అని నిర్ణయించుకున్నారని సమాచారం. MPగా పెద్దల సభకు పంపిచేందుకు కమలనాథులూ ఓకే అన్నారని రాజకీయ వర్గాలంటున్నాయి. దీనిపై అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది.