News March 2, 2025
RCB: ఆడోళ్లది అదే పరిస్థితి..!

WPLలో RCB వరుసగా నాలుగు మ్యాచులు ఓడి ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. తమ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచుల్లోనే చతికిలపడింది. నాలుగు సార్లు టాస్ కూడా ఓడడం గమనార్హం. ఇప్పటికే ఈ జట్టు పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచుల్లో భారీ తేడాతో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. కాగా IPLలోనూ ఆర్సీబీ ఇప్పటికీ కప్ కొట్టని విషయం తెలిసిందే.
Similar News
News December 23, 2025
కులపిచ్చి ముందు ఓడిన కన్నప్రేమ

టెక్నాలజీ పరుగులు తీస్తున్నా సమాజాన్ని ఇంకా కులం అనే సంకెళ్లు వీడటం లేదు. కర్ణాటకలో పరువు హత్యే దీనికి నిదర్శనం. దళితుడిని ప్రేమపెళ్లి చేసుకుందని 6 నెలల గర్భిణి అయిన మాన్యను కన్నతండ్రే కర్కశంగా హతమార్చాడు. బంధువులతో కలిసి ఇనుప రాడ్డులతో దాడి చేసి పుట్టబోయే బిడ్డతో సహా ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. ఈ ఘటన కొందరిలో కులపిచ్చి ఎంత బలంగా నాటుకుపోయిందో తెలియజేస్తోంది.
News December 23, 2025
పాపం ఆ తండ్రి.. గౌరవం కాపాడాల్సిన కొడుకే..!

UPలోని దేవరియాలో తండ్రిపైనే కేసు పెట్టాడో కొడుకు. తనను అందరి ముందు తిట్టి, కొట్టాడని PSకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. జరిగిన దాని గురించి వివరించేందుకు ఆ తండ్రి ఎంత ప్రయత్నించినా వినలేదు. చివరికి అందరి ముందు మోకాళ్లపై కూర్చొని, క్షమించమని కొడుకును వేడుకున్నాడు. ఆ తర్వాతే అతడు ఇంటికి రావడానికి అంగీకరించాడు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇలాంటి కొడుకు అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
News December 23, 2025
‘శిఖ’ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

‘శిఖ’- ఇది పవిత్రత, క్రమశిక్షణకు చిహ్నం. వేద నియమాల ప్రకారం.. తల శుభ్రం చేసుకున్నాక శిఖను మాత్రమే ఉంచుతారు. ఇది మన శరీరంలోని ‘సహస్రార చక్రం’ ఉన్న చోట ఉంటుంది. అలాగే దైవిక శక్తిని గ్రహించడానికి సాయపడుతుంది. స్నానం, నిద్ర, అంత్యక్రియల్లో తప్ప, మిగిలిన సమయాల్లో శిఖను విరబోయడం అశుభంగా భావిస్తారు. ఇది ఏకాగ్రతను పెంచుతుంది. అందుకే దీనిని ధరించడం, ముడివేయడం జీవనశైలిలో ఓ ముఖ్యమైన భాగంగా పరిగణిస్తారు.


