News October 2, 2024

సోషల్ మీడియాలో ఆర్సీబీ సరికొత్త మైలురాయి

image

సోషల్ మీడియాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సరికొత్త మైలురాయి అందుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ జట్టు 15 మిలియన్ల ఫాలోవర్లను చేరుకుంది. సీఎస్కే తర్వాత 15 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న జట్టుగా RCB నిలిచింది. ప్రస్తుతం సీఎస్కేకు 16 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఆ తర్వాత ముంబై (14.1M) కోల్‌కతా (6.4M), హైదరాబాద్ (4.4M), రాజస్థాన్ (4.4M), గుజరాత్ (4M), ఢిల్లీ (3.9M) పంజాబ్ (3.3M), లక్నో (3.2M) ఉన్నాయి.

Similar News

News November 17, 2025

ఏపీ న్యూస్ రౌండప్

image

* కడప జిల్లాలోని పుష్పగిరిలో 13వ శతాబ్దానికి చెందిన శాసనాలను పురావస్తు శాఖ గుర్తించింది.
* కల్తీ నెయ్యి కేసులో నిందితుడైన A24 చిన్న అప్పన్నను నేటి నుంచి 5 రోజులపాటు సిట్ విచారించనుంది. ఇదే కేసులో TTD మాజీ ఛైర్మన్ YV సుబ్బారెడ్డి ఈ నెల 19/20న విచారణకు హాజరుకానున్నారు.
* TTD మాజీ ఏవీఎస్‌వో సతీశ్ మృతి కేసును గుత్తి రైల్వే పోలీసుల నుంచి తాడిపత్రి పోలీసులకు బదిలీ చేయాలని అధికారులు నిర్ణయించారు.

News November 17, 2025

SAILలో 124 పోస్టులు.. అప్లై చేశారా?

image

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SAIL)లో 124 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇంజినీరింగ్ డిగ్రీ 65% మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు DEC 5వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1050, SC, ST, PwBDలకు రూ.300 వెబ్‌సైట్: www.sail.co.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News November 17, 2025

RGNIYDలో ఉద్యోగాలు

image

రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్‌మెంట్‌ (<>RGNIYD<<>>) 6 టీచింగ్ & నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 15లోపు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, M.Lib.sc, B.Lib.sc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.rgniyd.gov.in/